ఐపీఎల్ 2020 ప్రారంభ మ్యాచ్‌లో ఆరంభంలోనే చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) తడబాటుకు లోనైంది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన తెలుగు తేజం అంబటి రాయుడు (71, 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడి సీఎస్కే విజయంలో పోషించడంతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌ సైతం అందుకున్నాడు. రాయుడు (Ambati Rayudu) ఇన్నింగ్స్ చూసిన తర్వాత నెటిజన్లు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌పై మండిపడుతున్నారు. ఎమ్మెస్కేను ఓ రేంజ్‌లో 3D ట్రోలింగ్ చేస్తున్నారు. ధోనీ మార్క్ పంచ్ పేలింది.. Dhoni Is Back అంటున్న ఫ్యాన్స్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతేడాది జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో రాయుడిని సెలక్ట్ చేయకపోవడం, ఆపై విజయ్ శంకర్ త్రీడీ ఆటగాడు (బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్) అని ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పడం తెలిసిందే. దీంతో రాయుడు మనస్తాపానికి లోనై అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన తొందరపాటు చర్యగా భావించి రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. రాయుడికి వరల్డ్ కప్ ఛాన్స్ రాకపోవడం, మరోవైపు అతడి స్థానంలో తీసుకున్న విజయ్ శంకర్ ఆ ఈవెంట్‌లో విఫలం కావడం అభిమానులను కలచివేసింది. తాజాగా చెన్నై గడ్డు పరిస్థితుల్లో ఉన్న సమయంలో, రైనా లేని లోటును సైతం భర్తీ చేస్తూ సీఎస్కేను డిఫెండింగ్ చాంపియన్‌ ముంబైను ఓడించే ఇన్నింగ్ ఆడడంతో ట్రోలింగ్ మొలైంది.  MS Dhoni: అరుదైన ఘనత సాధించిన ఎంఎస్ ధోనీ


3D అద్దాలతో ఎమ్మెస్కే ప్రసాద్.. రాయుడు ఇన్నింగ్స్ చూసి ఉంటాడని కామెంట్ చేస్తున్నారు. IPL 2020: రెచ్చిపోయిన అంబటి రాయుడు.. ఐపిఎల్ 2020 తొలి మ్యాచ్‌లో ధోనీ సేన విజయం



కచ్చితంగా త్రీడీ అద్దాలతో రాయుడు బ్యాటింగ్‌ను చూసి ఉంటాడు. రాయుడు చాలా మంచి ఇన్నింగ్స్ ఆడావు అని మద్దతు తెలుపుతున్నారు. 



 


3D ప్లేయర్ (విజయ్ శంకర్) బదులుగా అంబటి రాయుడుకు 2019 వరల్డ్ కప్ ఛాన్స్ ఇచ్చింటే బాగుండేది. సెలక్టర్ల తప్పుడు నిర్ణయమని తెలిసిపోతుందని మరో నెటిజన్ ఎమ్మెస్కే ప్రసాద్‌ను ఎండగట్టాడు.



ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR