MS Dhoni Fans Trolling Virat Kohli after Lionel Messi sends gift to Ziva: ఖతార్‌ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్‌ 2022 ట్రోఫీని అర్జెంటీనా గెలుచుకున్న విషయం తెలిసిందే. ఫ్రాన్స్‌పై పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా 4-2 తేడాతో ఘన విజయం సాధించింది. దాంతో మూడున్నర దశాబ్దాల అర్జెంటీనా టైటిల్ నిరీక్షణ ఫలించింది. అంతేకాదు ఫుట్‌బాల్‌ సూపర్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సి స్వప్నం కూడా సాకారమైంది. టైటిల్‌ నెగ్గిన ఆనందంలో మునిగితేలుతున్న మెస్సి.. తన అభిమానులు, ఫాలోవర్లను మాత్రం అస్సలు మరిచిపోలేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫుట్‌బాల్‌ సూపర్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సికి ప్రపంచ వ్యాప్తంగా ఫాన్స్ ఉన్న విషయం తెలిసిందే. భారత్‌లోనూ మెస్సికి పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్‌ ఉన్నారు. అందులో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ లాంటి ఎందరో క్రికెటర్లూ అతడిని ఫాలో అవుతుంటారు. ధోనీ కూతురు జీవాకు కూడా మెస్సి అంటే చాలా ఇష్టం. ఈ నేపథ్యంలో మెస్సి తాను సంతకం చేసిన అర్జెంటీనా జెర్సీని జీవాకు పంపి తన ప్రేమను చాటాడు. 


లియోనెల్‌ మెస్సి పంపిన జెర్సీని ఏడేళ్ల చిన్నారి జీవా ధోనీ తన ఇన్‌స్టాలో పోస్టు చేసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యింది. ఆ జెర్సీపై ‘జీవా కోసం’ అని రాసి ఉంది. దాని కింద మెస్సి సంతకం చేశాడు. గతంలో కూడా బీసీసీఐ కార్యదర్శి జై షాకు ఇలాంటి జెర్సీనే మెస్సి పంపాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 'జీవాకు ఇంతకంటే మంచి క్రిస్మస్ బహుమతి ఏముంటుంది' అని ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. 



జీవా ధోనీకి లియోనెల్‌ మెస్సి గిఫ్ట్ పంపడంతో.. భారత క్రికెటర్ విరాట్ కోహ్లీని కొందరు నెటిజన్లు ఎగతాళి చేస్తున్నారు. మెస్సి ప్రత్యర్థి క్రిస్టియానో ​​రొనాల్డోకి కోహ్లీ పెద్ద ఫ్యాన్. మొరాకోతో పోర్చుగల్ ఓడిపోవడంతో రొనాల్డో జట్టు క్వార్టర్-ఫైనల్స్ నుండి నిష్క్రమించింది. ఆ  తర్వాత కోహ్లీ ఓ హృదయపూర్వక నోట్ వ్రాసాడు. రొనాల్డో గొప్ప ఫుట్‌బాల్ ఆటగాడిగా పేర్కొన్నాడు. ఇది మెస్సీ  డై-హార్డ్ అభిమానులకు నచ్చలేదు. భారత క్రికెట్‌కు గ్రేటెస్ట్ ఆల్ టైమ్ అయిన ధోనీకి ఫుట్‌బాల్ ప్రపంచంలో ఏకైక గ్రేటెస్ట్ ఆల్ టైమ్ ఎవరో తెలుసునని, తన కుమార్తెను సరైన పద్ధతిలో పెంచుతున్నాడని కోహ్లీని ఎగతాళి చేస్తున్నారు.


Also Read: దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారులో లోపాలు.. కొనడానికి ముందు ఈ విషయాలు తెలుసుకోండి!  


Also Read: ఈ బైక్ 'మైలేజ్'కా బాప్.. ఫుల్ ట్యాంక్ నింపితే 900 కిలోమీటర్లు పక్కా! కావాలంటే చెక్ చేసుకోండి  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.