Best Mileage Bike: ఈ బైక్ 'మైలేజ్'కా బాప్.. ఫుల్ ట్యాంక్ నింపితే 900 కిలోమీటర్ల ప్రయాణం పక్కా! కావాలంటే చెక్ చేసుకోండి

Best Mileage Bike Ever, Bajaj CT 100 is a Best mileage Bike. బజాజ్ సీటీ 100 (Bajaj CT 100) బైక్ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. మార్కెట్‌లో ఒక ప్రసిద్ధ బైక్ ఇది. ఎందుకంటే.. అద్భుతమైన మైలేజీని ఇస్తుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 28, 2022, 11:10 AM IST
  • ఈ బైక్ 'మైలేజ్'కా బాప్
  • ఫుల్ ట్యాంక్ నింపితే 900 కిలోమీటర్లు పక్కా
  • కావాలంటే చెక్ చేసుకోండి
Best Mileage Bike: ఈ బైక్ 'మైలేజ్'కా బాప్.. ఫుల్ ట్యాంక్ నింపితే 900 కిలోమీటర్ల ప్రయాణం పక్కా! కావాలంటే చెక్ చేసుకోండి

Highest Mileage Bike Ever, Bajaj CT 100 Bike gives 900 kms on a Full Tank: ప్రస్తుత రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు పెట్రోల్ ధర రూ. 96.72లుగా ఉండగా.. డీజిల్ ధర లీటరుకు రూ. 89.62గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.66గాను, లీటర్ డీజిల్ ధర రూ. 97.82గా ఉంది. దాంతో ప్రతి ఒక్కరు ఎలక్ట్రిక్ బైక్స్ కొనేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అదే సమయంలో కమ్యూటర్ బైక్‌లు దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. రోజువారీ సామాన్య ప్రయాణీకులు లేదా డైలీ రవాణాగా ఉపయోగించేందుకు ఈ బైక్‌లను తీసుకుంటున్నారు. సామాన్య ప్రజలు తక్కువ ధరలో అద్భుతమైన మైలేజీని ఇచ్చే బైక్‌ల కోసం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ అద్భుత మైలేజ్ ఇచ్చే బైక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

బజాజ్ సీటీ 100 (Bajaj CT 100) బైక్ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. మార్కెట్‌లో ఒక ప్రసిద్ధ బైక్ ఇది. ఎందుకంటే.. అద్భుతమైన మైలేజీని ఇస్తుంది. బజాజ్ సీటీ 100 బైక్ మైలేజ్ లీటరుకు 70 నుంచి 90 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సరైన సమయానికి సర్వీసింగ్ చేపించి.. మంచిగా మెయిటైన్ చేస్తే 90 కిలోమీటర్ల మైలేజ్ కూడా ఇస్తుంది. బైక్ యొక్క ఇంధన ట్యాంక్ సామర్థ్యం 10 లీటర్లు. ట్యాంక్ నింపడానికి మీకు దాదాపు రూ. 1090 ఖర్చవుతుంది. ఫుల్ ట్యాంక్ నింపితే మీరు దాదాపుగా 900కిమీ వరకు ప్రయాణించగలరు.

అయితే ప్రస్తుతం బజాజ్ సంస్థ బజాజ్ సీటీ 100 అమ్మకాలను నిలిపివేసింది. ఈ బైక్ స్థానంలో మరికొన్ని మోడల్స్ వచ్చాయి. సీటీ 100 బైక్‌ను నిలిపివేసే ముందు దాని ధర రూ. 52,832 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. అయితే మీరు సెకండ్ హ్యాండ్ బైక్‌ను మార్కెట్‌లో సులభంగా కొనుగోలు చేయవచ్చు. సెకండ్ హ్యాండ్ వాహనాలను విక్రయిస్తున్న కొన్ని వెబ్‌సైట్లలో ఈ బైక్ దాదాపు రూ. 30,000-40,000కు విక్రయిస్తున్నారు. 

బజాజ్ సీటీ 100 బైక్‌లో 102సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 7.9 PS మరియు 8.3 Nm అవుట్‌పుట్ ఇస్తుంది. దీని బరువు 108 కిలోలు మాత్రమే. మూడు రంగుల ఎంపికలలో (బ్లూ, ఎరుపు మరియు ఫ్లేమ్ రెడ్) కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది. ఇది టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ మరియు హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ వంటి బైక్‌లతో మార్కెట్‌లో పోటీపడుతుంది. హాలోజన్ లైట్లు, ఫుల్ బాడీ గ్రాఫిక్స్, సింగిల్-పీస్ సీట్, అల్లాయ్ వీల్స్ మరియు కాంబి-బ్రేకింగ్ సిస్టమ్ (CBS) వంటి ఫీచర్స్ ఉంటాయి.

Also Read: Shikhar Dhawan: వన్డే జట్టులో దక్కని చోటు.. ఇక శిఖర్ ధావన్‌ కెరీర్ ముగిసినట్లేనా?

Also Read: UP Fire Accident: యూపీలో అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News