New Zealand Beat Australia: డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాకు టీ20 వరల్డ్‌ కప్‌ను ఓటమితో ఆరంభించింది. న్యూజిలాండ్‌ చేతిలో దారణంలో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 200 పరుగులు చేయగా.. ఆసీస్ 17.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 89 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కివీస్ ఆల్ రౌండ్‌ షోతో అదరగొట్టి.. పొట్టి ప్రపంచ కప్‌ను ఘనంగా బోణీ చేసింది. 92 పరుగులతో దుమ్ములేపిన న్యూజిలాండ్ ఓపెనర్ కాన్వేకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొదట టాస్ గెలిచి ఆసీస్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో కివీస్ మొదట బ్యాటింగ్ ఆరంభించింది. ఓపెనర్లు ఫిన్ అలెన్, కాన్వే దూకుడుగా ఆడి మంచి ఆరంభాన్నిచ్చారు. 
4 ఓవర్లనే 56 పరుగులు జోడించారు. ముఖ్యంగా ఫిల్ అలెన్‌ (42)ను చెలరేగి ఆడాడు. హజిల్‌వుడ్‌ అతడిని క్లీన్‌ బౌల్డ్ చేయడంతో 56 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తరువాత కెప్టెన్ విలియమ్సన్‌తో కలిసి కాన్వే ఇన్నింగ్స్‌ను నడిపించాడు.


స్కోర్ బోర్డు 125 పరుగులు చేరుకున్నాక జంపా బౌలింగ్‌లో విలియమ్సన్ (23) ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇదే ఓవర్‌లో మొదటి బంతికి సిక్సర్ బాది అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు కాన్వే. ఇక చివర్లో కాన్వేతో పాటు నీషమ్ బ్యాట్ ఝలిపించడంతో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. కాన్వే 92 పరుగులతో నాటౌట్‌గా మిగిలాడు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ రెండు వికెట్లు తీసుకోగా.. హజిల్‌వుడ్, స్టాయినిస్, జంపా చెరో వికెట్ తీశారు.


201 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కంగారులకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు వార్నర్ (5), ఫించ్‌ (13), మిచెల్‌ మార్ష్‌ (16) వెంటవెంటనే ఔట్ అయ్యారు. ఈ సమయంలో కాసేపు స్టాయినిస్, మ్యాక్‌వెల్‌ ఆచితూచి ఆడినా.. కివీస్ బౌలర్లు మళ్లీ రెచ్చిపోయారు. శాంటర్న్ బౌలింగ్‌లో ఫిలిప్స్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో స్టాయినిస్ 7 పరుగులకే డగౌట్‌కు వెళ్లిపోయాడు. ఆ తరువాత టిమ్ డేవిడ్ (11), మ్యాథ్యూ వేడ్ (2) కూడా తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరుకున్నారు. మరో ఎండ్‌లో పోరాడుతున్న మ్యాక్స్‌ వెల్ (28) కూడా ఔట్ అవ్వడంతో ఆసీస్ ఓటమి ఖరారైపోయింది. చివర్లో కమ్మిన్స్ (21) కాస్తా ఫర్వాలేదనిపించాడు. చివరికి 17.1 ఓవర్లలో 111 పరుగుల వద్ద ఆసీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. కివీస్ బౌలర్లలో టిమ్ సౌదీ, మిచెల్ శాంటర్న్ చెరో మూడు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్డ్, ఫెర్గుసన్, ఇష్ సోధీ చెరో వికెట్ తీశారు. 


Also Read: IND vs PAK: ఇండియా-పాక్ మ్యాచ్ రద్దు అయితే రిజర్వ్ డే..? ఏం జరుగుతుంది..!  


Also Read: Bigg Boss 7th Week Elimination : లవ్ ట్రాక్‌కు పుల్ స్టాప్.. అతడే అవుట్?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook