Bigg Boss 7th Week Elimination : బిగ్ బాస్ షాకింగ్ నిర్ణయం.. లవ్ ట్రాక్‌కు పుల్ స్టాప్.. అతడే అవుట్?

Bigg Boss 6 Telugu 7th Week Elimination Buzz బిగ్ బాస్ ఇంట్లోంచి ఏడో కంటెస్టెంట్ బయటకు వెళ్లే సమయం వచ్చింది. అసలే ఈ ఏడో వారం మరింత చప్పగా సాగింది షో. ఈ వారం అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అయినట్టు సమాచారం అందుతోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 22, 2022, 04:08 PM IST
  • బిగ్ బాస్ ఇంట్లో ఏడో వారం
  • అర్జున్ కళ్యాణ్ ఎలిమినేషన్?
  • లవ్ ట్రాక్‌కు బిగ్ బాస్ స్వస్తి?
Bigg Boss 7th Week Elimination : బిగ్ బాస్ షాకింగ్ నిర్ణయం.. లవ్ ట్రాక్‌కు పుల్ స్టాప్.. అతడే అవుట్?

Bigg Boss Arjun Kalyan Elimination : బిగ్ బాస్ ఇంట్లో ప్రస్తుతం ఏడో వారం గడిచేందుకు వచ్చింది. ఇప్పటికే ఆరు వారాలు కాగా.. ఆరుగురు కంటెస్టెంట్లు బయటకు వెళ్లారు. షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప ఇలా ఆరుగురు బయటకు వచ్చారు. ఇక ఈ ఏడో వారంలో బయటకు వచ్చే కంటెస్టెంట్ పేరు చక్కర్లు కొడుతోంది. ఈ ఏడోవారం దాదాపు పదికిపైగా కంటెస్టెంట్లు నామినేషన్లోకి వచ్చారు. ఈ వారం ఆట కూడా అంత ఎఫెక్టివ్‌గా అనిపించలేదు.

చెత్త కంటెస్టెంట్లు.. వరస్ట్ కంటెస్టెంట్లు.. బిగ్ బాస్ పట్ల గానీ, ఆట పట్ల గానీ, ఆడియెన్స్ పట్ల గానీ ఏ మాత్రం కూడా భయం, భక్తి, గౌరవం లేవని చీవాట్లు పెట్టాడు. ఒక రోజంతా ఫుడ్ పెట్టకుండా కడుపు మాడిపోయాలే చేశాడు బిగ్ బాస్. ఇక మొత్తానికి కాస్త బుద్ది తెచ్చుకున్న కంటెస్టెంట్లు అన్నం విలువ తెలుసుకున్నారు. ఆటల ఆడి అన్నం ముద్దలు తిన్నారు. అయితే ఈ సారి కంటెస్టెంట్లు మాత్రం చాలా చాలా వరస్ట్.. అని అందరూ ఫిక్స్ అయ్యారు. ఆట సగానికి వచ్చినా.. ఒక్క డిసర్వింగ్ కంటెస్టెంట్ మాత్రం కనిపించడం లేదు.

రేవంత్, గీతూ, బాలాదిత్య, శ్రీహాన్ వంటి వారున్నా కూడా టైటిల్ ఇచ్చేంత గొప్పగా ఆడటం లేదు. ముందు ఆ గీతూని ఎలిమినేట్ చేసి పారేయండని జనాలు మొత్తుకుంటున్నారు. ఆ ఆదిరెడ్డిని కూడా బయటకు పంపించేయండని అంటున్నారు. కానీ గీతూ వల్లే కంటెంట్ వస్తోందన్న ఉద్దేశ్యంలో ఆమెను ఇంట్లోనే ఉంచుతున్నారు. ఆమె చివరకు బిగ్ బాస్ రూల్స్‌ను పాటించకుండా.. వాటికి వ్యతిరేకంగా నడుస్తోంది.

ఇప్పుడు ఈ ఏడో వారం ఎలిమినేషన్‌లో అందరికీ షాక్ అయ్యే వార్త వినిపించేలా ఉంది. బిగ్ బాస్ ఇంట్లో ఇప్పుడు ఇనయ సూర్య ట్రాక్ ఉంది. అది కాకుండా శ్రీ సత్య అర్జున్ ట్రాక్ ఉంది. కానీ సత్య పట్టించుకోదు. అయినా అర్జున్ వదలడు. ఆమె కోసం మాత్రమే బిగ్ బాస్ ఇంటికి వచ్చినట్టుగా అర్జున్ ప్రవర్తిస్తుంటాడు. అందుకే ఈ సారి అర్జున్‌ను ఇంటి నుంచి బయటకు పంపించేందుకు ప్రేక్షకులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ వారం రేవంత్, అర్జున్, శ్రీహాన్, ఆదిత్య, ఆదిరెడ్డి, వాసంతి, శ్రీ సత్య, ఫైమా, కీర్తి, మెరినా, రాజ్, ఇనయ, రోహిత్ వంటివారు నామినేట్ అయ్యారు. మామూలుగా అయితే ఈ సారి కీర్తి ఎలిమినేట్ అవుతుందని అంతా భావించారు. లేదంటే మెరినా రోహిత్‌లోంచి ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని అనుకున్నారు. కానీ అర్జున్ కళ్యాణ్‌ను బిగ్ బాస్ బయటకు పంపించినట్టు టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.

Also Read : Nandamuri Balakrishna First Ad : కెరీర్‌లో మొదటిసారిగా బాలయ్య అలా

Also Read : Allu Aravind - Anu Emmanuel : ఆలస్యంగా అను ఇమాన్యుయేల్.. అల్లు అరవింద్ కౌంటర్లు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News