India vs Pakistan: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌కు వరుణుడి భయం పట్టుకుంది. ఈ మెగా టోర్నీలో కీలక మ్యాచులను వర్షం కారణంగా రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లానినా ఎఫెక్ట్ మరికొన్ని రోజులు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహనికి గురవుతున్నారు. శనివారం నుంచి ప్రపంచ కప్ మొదలవ్వనుండగా.. వరుణుడు కరుణిస్తేనే మ్యాచ్‌లు సాజావుగా సాగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే గబ్బాలో టీమిండియా, కివీస్ మధ్య జరగాల్సిన వార్మప్ మ్యాచ్ ఒక్క బంతి కూడా పడంకుండా రద్దై విషయం తెలిసిందే.
ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల కళ్లంతా ఈ నెల 23న భారత్-పాకిస్థాన్ మధ్య జరగబోయే మ్యాచ్‌పైనే ఉన్నాయి. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో జరిగే ఈ మ్యాచ్‌కు 50 వేల మంది కంటే ప్రేక్షకులను హాజరుకానున్నారు. కోట్లాది మంది అభిమానులు టీవీ సెట్‌లకు అతుక్కుపోతారు. మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి పనిలేదు.
ఇంత హైప్ ఉన్న ఈ మ్యాచ్‌కు వర్షం కలిగించే అవకాశం ఉండడంతో క్రికెట్ అభిమానుల నిరాశ చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి ఇండియా-పాక్ మ్యాచ్ రద్దయితే..
ఏం జరుగుతుందని చాలా మంది ఫ్యాన్స్ అడుగుతున్నారు.
మ్యాచ్ రద్దయితే.. రీమ్యాచ్ లేదా రీషెడ్యూల్ చేయాలని కొందరు అభిమానులు కోరుతున్నారు. అయితే గ్రూప్ దశలో జరిగే మ్యాచ్‌లకు ఐసీసీ రిజర్వ్ డేను ఉంచలేదు. గ్రూప్ దశల్లో జరిగే ఏ మ్యాచ్‌కి కూడా రిజర్వ్ డేలు ఉండవు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వర్షార్పణం అయితే ఇరు జట్లు పాయింట్లు పంచుకుంటాయి. రెండు చెరో పాయింట్‌తో సరిపెట్టుకోవాల్సిందే.
అభిమానులు, ఆటగాళ్లను ఎంత నిరాశకు గురిచేసినా ఎవరూ ఏమీ చేయలేరు. మ్యాచ్‌ను ఆసీస్‌లోని మరో నగరానికి మార్చాలంటూ మరికొందరు అడుతున్నారు. అయితే ఇంత తక్కువ సమయంలో మ్యాచ్ వేదిక మార్చడం అంత సులభం కాదు. అందులోనా వరల్డ్ కప్‌లో జరిగే మ్యాచ్ వేదిక మార్చడం అస్సలు కుదరదు.
Also Read: Jio Recharge Plans: జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్.. అందుబాటులో సూపర్ ప్లాన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook