New Zealand World Cup Records: న్యూజిలాండ్.. ఆల్‌రౌండర్లకు నిలయం. పేపర్‌పై చూస్తే జట్టు ఎంతో పటిష్టంగా ఉంటుంది. అందుకు తగినట్లే ప్రతీ ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్‌ వరకు దూసుకురావడం.. వెనక్కి వెళ్లిపోవడం తంతుగా మారింది. గత రెండు ప్రపంచకప్‌లలో ఫైనల్‌కు చేరినా.. విశ్వకప్‌ను ముద్దాడలేకపోయింది. 2019 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ జట్టుకు దీటుగా ఆడింది. మ్యాచ్ టైగా ముగియగా.. రెండు సూపర్ ఓవర్లు నిర్వహిస్తే రెండు కూడా సమం అయ్యాయి. చివరి బౌండరీలు ఎక్కువ బాదిన ఇంగ్లాండ్ ఛాంపియన్‌గా అవతరించింది. ఎంతో పోరాటపటిమ కనబర్చిన న్యూజిలాండ్.. అందరి హృదయాలను గెలుచుకుని టోర్నీ నుంచి తప్పుకుంది. మరోసారి అదేస్పూర్తితో భారత్ వేదికగా అక్టోబర్ 5న నుంచి ప్రపంచకప్ వేటను ఆరంభించనుంది. కెప్టెన్ విలియమ్సన్ గాయం నుంచి కోలుకుని తిరిగి రావడం కివీస్‌కు అతి పెద్ద బలం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత వన్డే ప్రపంచ కప్‌లలో కివీస్ ఫైనలిస్ట్‌గా నిలిచింది. 2015 ప్రపంచకప్‌లో  ఆస్ట్రేలియా చేతిలో.. 2019లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయి నిరాశగా వెనుతిరిగింది. ఇప్పటివరకు ఆడిన 12 వన్డే ప్రపంచకప్‌లలో న్యూజిలాండ్ ఏకంగా ఆరుసార్లు సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది. కానీ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. 2019 ప్రపంచకప్‌ సెమీ ఫైనల్స్‌లో భారత్‌ను న్యూజిలాండ్ ఓడించింది. 


1975 వన్డే ప్రపంచ కప్ నుంచి 2019 వరల్డ్ కప్ వరకు న్యూజిలాండ్ కేవలం రెండుసార్లు మాత్రమే గ్రూప్ దశ నుంచి నిష్క్రమించింది. న్యూజిలాండ్ 1975, 1979లో ఆడిన రెండు ప్రపంచకప్‌లలో సెమీ ఫైనల్‌కు చేరుకుంది. ఆ తరువాత రెండు టోర్నీల్లోనూ గ్రూప్ స్టేజ్‌ దాటకలేకపోయింది. 1992 ప్రపంచకప్‌లో మళ్లీ సెమీస్‌కు చేరినా.. ఫైనల్‌కు చేరడంలో విఫలమైంది. 1996లో క్వార్టర్ ఫైనల్ చేరుకోగా.. 1999‌లో మరోసారి టాప్‌-4లో నిలిచింది. 2003లో సూపర్-6కి చేరింది.  2007, 2011 ప్రపంచకప్‌లలో వరుసగా సెమీ ఫైనల్‌లో చోటు దక్కించుకుంది. మొత్తం 12 ప్రపంచకప్‌లలో 6 సార్లు సెమీఫైనల్‌కు చేరుకుంది. కివీస్ అంటే మినిమమ్ సెమీస్ గ్యారంటీ అనే ముద్ర పడిపోయింది.  


ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ ప్రయాణం ఇలా..


==> 1975- సెమీఫైనలిస్ట్
==> 1979- సెమీఫైనలిస్ట్
==> 1983- గ్రూప్ స్టేజ్
==> 1987- గ్రూప్ స్టేజ్
==> 1992- సెమీఫైనలిస్ట్
==> 1996- క్వార్టర్‌ఫైనలిస్ట్ 
==> 1999- సెమీఫైనలిస్ట్
==> 2003- సూపర్ 6
==> 2007- సెమీఫైనలిస్ట్
==> 2011- సెమీఫైనలిస్ట్
==> 2015- రన్నరప్
==> 2019- రన్నరప్.


వరల్డ్ కప్‌కు న్యూజిలాండ్ టీమ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్ (వైస్ కెప్టెన్), డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌతీ, విల్ యంగ్.


Also Read: Vande Bharat Express: ఒక్క రోజులో బెంగుళూరుకు వెళ్లి రావొచ్చు.. 'వందే భారత్' ప్రారంభోత్సవంలో కిషన్ రెడ్డి      


Also Read: Snake Bite: ఒకే కుటుంబంలో ముగ్గురిని కాటు వేసిన పాము.. ఇద్దరు మృతి  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి