హైదరాబాద్: ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పట్లో ఇండియాలో క్రికెట్‌ తిరిగి ప్రారంభించడం సాధ్యం కాదని  మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు. కరోనా వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ ఎత్తివేసినప్పటికీ రోజురోజుకీ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీనివల్ల ప్రస్తుతానికి ఇండియాలో క్రికెట్‌ను మొదలు పెట్టడం కష్టమన్నారు. అయితే క్రికెట్‌ను మళ్లీ మొదలుపెట్టే పరిస్థితుల్లో ఉన్నామని తాను అనుకోవడం లేదని తెలిపారు. అంతా సర్దుకునే వరకు వేచి ఉండటం బెటర్ అని ద్రవిడ్ పేర్కొన్నాడు.ఇదిలావుండగా మేం నెలల వారీగా అన్నింటిని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. International Yoga day 2020: కరోనా కష్టాలకు ప్రాణాయామంతో చెక్: ప్రధాని మోదీ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: కరోనాకు కొత్త పేరు పెట్టిన ట్రంప్....


 మరోవైపు ఈ ఏడాది ఆగస్టు–సెప్టెంబర్‌‌లో మొదలయ్యే డొమెస్టిక్ సీజన్ అక్టోబర్‌‌లో ప్రారంభం కానుండగా ఈ సీజన్‌ను తగ్గిస్తారా లేదా అన్నది వేచిచూడాల్సిందేనన్నారు. ప్రస్తుతము అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఎలా ఆడతామనేది ప్రభుత్వ గైడ్‌లైన్స్‌తోపాటు మెడికల్ ఎక్స్‌పర్ట్స్‌పై ఆధారపడి ఉంటుందని, సాధ్యమైనంత వరకు క్రికెట్‌ సీజన్‌ను మనం కోల్పోబోమని ద్రవిడ్ పేర్కొన్నాడు. ఈ ఏడాది చివరకు అయినా క్రికెట్ జరుగుతుందని ఆశిస్తున్నానని రాహుల్ ద్రవిడ్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. 


 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..