Team India Cricketers Meet Jr NTR in Hyderabad ahead of IND vs NZ ODI: భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య బుధవారం (జనవరి 18) నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. మూడు వన్డేలలో భాగంగా రేపు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఆడేందుకు భారత్, న్యూజిలాండ్‌ జట్లు ఇప్పటికే హైదరాబాద్‌కు వచ్చాయి. ప్రాక్టీస్ కూడా చేస్తున్నాయి. బుధవారం మ్యాచ్ కావడంతో భారత క్రికెటర్లు నగరంలో సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను భారత ప్లేయర్స్ కలిశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఖరీదైన కార్‌ కలెక్షన్స్‌తో ప్రసిద్ధిగాంచిన హైదరాబాద్‌ వాసి నజీర్ ఖాన్‌ ఇంట్లో భారత క్రికెటర్లు, జూనియర్ ఎన్టీఆర్‌ కలుసుకున్నారు. భారత ప్లేయర్స్ సూర్యకుమార్‌ యాదవ్‌, శుబ్‌మన్ గిల్, ఇషాన్‌ కిషన్, యుజ్వేంద్ర చహల్ మరియు శార్దూల్‌ ఠాకూర్‌లు ఎన్టీఆర్‌తో కాసేపు సరదాగా ముచ్చటించారు. అనంతరం ఫొటోస్ కూడా దిగారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సూర్యకుమార్‌ సతీమణి దేవిషా శెట్టి కూడా ఎన్టీఆర్‌తో ఫొటో దిగారు. భారత ఆటగాళ్లలో పలువురు నజీర్‌కు స్నేహితులు ఉండటంతోనే.. అతడి ఇంటికి వెళ్లారట. 


పాన్ ఇండియా సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని 'నాటు నాటు' పాటకు గోల్డెన్ గ్లోబ్ అందుకోవడంపై చిత్ర యూనిట్‌కు సూర్యకుమార్‌ యాదవ్‌ శుభాకాంక్షలు చెప్పాడు. తన సతీమణితో కలిసి ఎన్టీఆర్‌తో దిగిన  ఫొటోను సూర్య తన ట్విటర్‌లో పోస్టు చేశాడు. క్రికెట్ అభిమానులు, ఎన్‌టీఆర్‌‌ ఫాన్స్ ఈ ఫోటోలను చూసి తెగ మురిసిపోతున్నారు. ఇయర్ ఎండ్ ట్రిప్ పేరిట భార్య ప్రణతి, కుమారులతో  కలిసి అమెరికా వెళ్లిన ఎన్‌టీఆర్‌.. తాజాగా హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. గతేడాది ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్ సందర్భంగా కూడా కొందరు భారత ప్లేయర్స్.. రామ్ చరణ్, చిరంజీవిని కలిసిన విషయం తెలిసిందే. 



స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లను కైవసం చేసుకున్న భారత్.. అదే దూకుడును కొనసాగిస్తూ న్యూజిలాండ్‌పై కూడా కొనసాగించాలని చూస్తోంది. న్యూజిలాండ్‌లో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. జనవరి 18, 21, 24 తేదీలలో వన్డేలు జరగనుండగా.. జనవరి 27, 29, ఫిబ్రవరి 1న టీ20లు జరుగుతాయి. ఇరుజట్ల మధ్య ఉప్పల్ స్టేడియంలో రేపు మధ్యాహ్నం తొలి వన్డే జరగనుంది.


Also Read: Best Hyundai Creta: రూ. 8 లక్షలకే హ్యుందాయ్ క్రెటా.. వెంటనే కొనేసుకోండి! ఈ అవకాశం మళ్లీమళ్లీ రాదు


Also Read: Best Electric Scooters: ఓలాకు పోటీగా ఆంపియర్.. 85 వేల కంటే తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.