Coronavirus : కరోనా సంక్షోభం  ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రంగాలపై పడింది. ఇందులో  క్రికెట్ ( International Cricket )  కు కూడా మినహాయింపు లభించలేదు.  కరోనా కల్లోలం ( Corona Pandemice) ప్రారంభం అయినప్పటి నుంచి కొత్తగా మ్యాచులు లేకపోవడం వల్ల అభిమానులు తీవ్రంగా నిరాశపడుతున్నారు.  అయితే క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ ఏంటంటే మరో వారం రోజుల్లో (జులై 8 -12 ) ఇంగ్గాండ్ - వెస్ట్ ఇండీస్ ( England vs West indies test 2020 ) మధ్య టెస్టు మ్యాచు ప్రారంభం కానుంది. అయితే అప్పటి  వరకు క్రికెట్ను మిస్ అయ్యే వారు పాత మ్యాచులు చూసుకుని ఆనందించవచ్చు.  Read Also :  అవతార్ ఫీచర్ ను లాంచ్ చేసిన facebook..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


సరిగ్గా సంవత్సరం క్రితం అంటే 2 జులై 2019న ప్రపంచ కప్ ( Cricket World Cup 2019 ) సెమీస్ లో చోటు సంపాదించడానికి  టీమ్ ఇండియా ( Team India )  వీరోచిత పోరాటం చేసింది. ఇందులో రోహిత్ శర్మ ( Rohit Sharma )  అద్భుతమైన  సెంచరీతో  భారత్ కు భారీ స్కోర్ ను సాధించి పెట్టాడు. తొలి వికెట్కు రోహిత్ వర్మ- కెఎల్ రాహల్ ( KL Rahul ) కలిసి మొత్తం 180 పరుగుల చేయగా.. నిర్ణీత 50 ఓవర్లలో టీమ్ ఇండియా 9 వికెట్లు కోల్పోయి 314 పరుగులు సాధించింది.




 


అయితే భారీ లక్ష్మంతోె బరిలోకి దిగిన బంగ్లాదేశ్ టీమ్ 286 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ 28 పరుగుల తేడాతో విజయం సాధించి  సెమిఫైనల్లోకి అడుగుపెట్టింది. బంగ్లాదేశ్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది.