Sreesanth Ban Ends: శ్రీశాంత్‌పై ముగిసిన నిషేధం.. ఐపీఎల్ ఛాన్స్ వస్తుందా?
టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్‌పై విధించిన ఏడేళ్ల నిషేధం (Sreesanth Ban Ends) నేటితో ముగిసింది. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడన్న ఆరోపణలతో కేరళకు స్టార్ పేసర్ శ్రీశాంత్‌పై తొలుత బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది.
టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. శ్రీశాంత్‌పై విధించిన ఏడేళ్ల నిషేధం (Sreesanth Ban Ends) నేటితో ముగిసింది. ఇండియ్ ప్రీమియర్ లీగ్ (IPL) లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడన్న ఆరోపణలతో కేరళకు స్టార్ పేసర్ శ్రీశాంత్‌పై తొలుత బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించగా జీవితకాల నిషేధాన్ని ఎత్తేసింది. Iran: రెజ్లర్ నవీద్ అఫ్కారీని ఉరితీసిన ప్రభుత్వం
మరోవైపు ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్ తప్పు చేశాడని ప్రధానంగా ఎలాంటి రుజువులు లేవు. అయితే బుకీలు సంప్రదించడం ఒక్కటే చేసిన తప్పుగా పరిగణించి శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధాన్ని ఎత్తివేసి, శిక్షను సైతం తగ్గించాలిన బీసీసీఐ అంబుడ్స్ మన్‌కు సుప్రీంకోర్టు సూచించింది. ఏడేళ్ల నిషేధానికి శిక్షను తగ్గించారు. 2013 నుంచి నిషేధం ఎదుర్కొంటున్న పేస్ బౌలర్ శ్రీశాంత్ ఆదివారంతో తన నిషేధకాలం ముగిసింది. బిగ్‌బాస్ ఫైనలిస్ట్ Rashami Desai Hot Photos వైరల్
తొలి టీ20 వరల్డ్ కప్ 2007 లో భారత్ విజయం సాధించడంలో శ్రీశాంత్ సైతం కీలకపాత్ర పోషించాడు. కానీ ఫిక్సింగ్ ఆరోపణలతో కెరీర్ నాశనం చేసుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2020 ప్రారంభం కానున్న తరుణంలో నిషేధకాలాన్ని పూర్తి చేసుకున్నాడు. శ్రీశాంత్‌కు ఏదైనా అవకాశం ఇస్తుందా అని ఎదురుచూస్తున్నాడు. పేసర్ శ్రీశాంత్ ఇంకా ఫిట్‌గా ఉండి, రేసులో ఉన్నాడని భావిస్తే ఏదైనా ఫ్రాంచైజీ నుంచి అతడికి పిలుపు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. Trent Boult breaks a stump: ఐపీఎల్ ప్రాక్టీస్‌లో వికెట్లు విరుగుతున్నాయి..
ఫొటో గ్యాలరీలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYeR