Danish Kaneria: టీమ్ ఇండియా మాజీ రధ సారధి విరాట్ కోహ్లీకు విదేశాల్లో ముఖ్యంగా ప్రత్యర్ధి దేశంలో కూడా అభిమానులున్నారు. దాయాది దేశం మాజీ క్రికెటర్ విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య కీలకమైన మ్యాచ్ ఆగస్టు 28 అంటే రేపు సాయంత్రం జరగనుంది. ఆసియా కప్ 2022లో ఈ రెండు జట్ల మధ్య ఇదే తొలి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ప్రదర్శనపై అందరి దృష్టి నెలకొంది. ఈ క్రమంలో ప్రత్యర్ధి దేశం పాకిస్తాన్ మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా విరాట్ కోహ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.


ఇప్పుడు జరగనున్న ఆసియా కప్ 2022 విరాట్ కోహ్లి కెరీర్‌ను మార్చే టోర్నమెంట్‌గా మారనుందని దానిష్ కనేరియా తెలిపాడు. విరాట్ కోహ్లీ..వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉండటం సరైన నిర్ణయం కాదని కూడా దానిష్ కనేరియా వ్యాఖ్యానించాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లు వదలడం మంచిది కాదని..అవసరమైతే ఐపీఎల్ వదిలేసి ఉండాల్సిందని చెప్పాడు. విరాట్ తిరిగి ఫామ్‌లో రావల్సిన అవసరం ఎంతైనా ఉందని..ఆసియా కప్ అతని కెరీర్‌లో కీలకం కానుందని దానిష్ కనేరియా చెప్పాడు. 


ఆసియా కప్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లో అందరి దృష్టి విరాట్ కోహ్లీ ఫామ్‌పైనే ఉంటుందని దానిష్ కనేరియా తెలిపాడు. విరాట్ కోహ్లీకు రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్ మద్దతుందని చెప్పాడు. తనను తాను రుజువు చేసుకోవాలని..అందరి దృష్టి విరాట్‌పైనే ఉంటుందని అన్నాడు.


ఆసియా కప్ టోర్నమెంట్ విరాట్ కోహ్లీ కెరీర్‌కు కీలకమైందని..ఎందుకంటే ఈ టోర్నీ తరువాత టీమ్ ఇండియా ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచ కప్ ఆడనుందని చెప్పాడు. అందుకే ఆసియా కప్ కోహ్లీకు కెరీర్ మార్చే టోర్నీ కానుంది. విరాట్ ఒకసారి ఆసియా కప్‌లో ఫామ్‌లో వస్తే..ఇక మరో 3-4 ఏళ్లు పరుగులు చేస్తుంటాడని దానిష్ కనేరియా చెప్పాడు. విరాట్ అంటే ఒక పెద్ద పేరని..ఒక బ్రాండ్ అని అందుకే ప్రేక్షకుల అంచనాలు కూడా భారీగానే ఉంటాయన్నాడు. విరాట్ నుంచి సెంచరీ కోరుకుంటున్నారని చెప్పాడు. 


విరాట్ కోహ్లీ అంతా బాగానే చేస్తున్నాడు..క్రీజ్‌పై ఎక్కువ సమయం ఉండటం, స్టైల్, టెక్నిక్ అంతా బాగానే ఉందని దానిష్ చెప్పాడు. అయితే ఏదో బ్యాడ్ టైమ్ వెంటాడుతోందని..తెలిపాడు. ఆ బ్యాడ్ టైమ్ నుంచి విరాట్ కోహ్లీ బయటకు వస్తే ఇక తిరుగుండదని దానిష్ కనేరియా తెలిపాడు. 


Also read: Ganguly On IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్ పెద్ద విషయం కాదు.. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో భారత ఆటగాళ్లకు తెలుసు: గంగూలీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook