Pakistan vs New Zealand 2nd ODI: రెండో వన్డేలో న్యూజిలాండ్ 79 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో బాబర్ అజామ్ మినహా పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించలేకపోయారు. ఈ విజయంతో సిరీస్‌ 1-1తో సిరీస్‌ను సమం చేసింది కివీస్‌. అయితే ఈ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పాక్ ఫీల్డర్ బంతిని వికెట్ల వద్దకు విసిరగా.. బంతి అంపైర్ అలీమ్ దార్‌ కాలికి బలంగా తాకింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ 35వ ఓవర్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా.. హారిస్‌ రౌఫ్‌ బౌలింగ్‌ చేశాడు. ఈ ఓవర్ నాలుగో బంతికి.. ఫిలిప్స్ డీప్ స్క్వేర్ లెగ్ వద్ద షాట్ ఆడగా.. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న పేసర్ మహ్మద్ వసీం వద్దకు బంతికి వెళ్లింది. అక్కడి నుంచి బాల్ అందుకున్న వసీమ్.. నేరుగా వికెట్ల వద్దకు విసిరాడు. అయితే అక్కడ అంపైర్ అలీమ్ దార్ కాలికి తగిలింది. 


దీంతో నొప్పి తట్టుకోలేకపోయిన అంపైర్ అలీమ్ దార్ కోపంతో చేతిలో ఉన్న జెర్సీని నేలపై విసిరాడు. వెనుక నుంచి అయ్యో అంటూ కెప్టెన్ బాబార్ అజామ్ చిన్న స్మైల్ ఇచ్చాడు. నసీమ్ షా కూడా అంపైర్ కాలిని పట్టుకుని చెక్ చేశాడు.  పాదాలను పట్టకుని బంతి పడిన చోట రఫ్ చేశాడు. అనంతరం మళ్లీ అంపైరింగ్ కంటిన్యూ చేశాడు.


 



న్యూజిలాండ్‌ తరఫున ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌ డెవాన్‌ కాన్వాయ్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో కలిసి అతను అద్భుతమైన భాగస్వామ్యాన్ని ఆడాడు. కాన్వాయ్ 92 బంతుల్లో 101 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. విలియమ్సన్ 85 పరుగులు చేశాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 49.5 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం పాకిస్థాన్ 182 పరుగులకే కుప్పకూలింది. బాబార్ అజామ్ (79) ఒక్కడే రాణించగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా చేతులెత్తేశారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కాన్వేను వరించింది. పాక్ తరఫున మహ్మద్ నవాజ్ అత్యధికంగా 4 వికెట్లు తీశాడు.


Also Read: Ind Vs SL: సిరీస్‌ విజయంపై భారత్ కన్ను.. ఆ ప్లేయర్‌ను ఆపితేనే..!  


Also Read: India vs Sri Lanka: విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా మధ్య విభేదాలు.. నెట్టింట వీడియో వైరల్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి