Manu baker win bronze in paris Olympics: భారత్ షూటర్ మనూబాకర్ ఒలింపిక్స్ లో సత్తా చాటింది. ఎయిర్ పిస్టల్ విభాగంలో10 కాంస్యం గెలుచుకుంది. దీంతో మన దేశం ఒలింపిక్స్ లో బోణి కొట్టిందని చెప్పుకొవచ్చు. ఇదిలా ఉండగా..  221.7 పాయింట్లతో మూడో స్థానంలో మనూబాకర్ నిలిచింది. ఇద్దరు కొరియన్ అథ్లేట్లు స్వర్ణం, రజతం సాధించారు. పారిస్ లో ఒలింపిక్ వేడుకలు అట్టహసంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో మన భారత్  నుంచి మొత్తం 117 మంది భారత క్రీడాకారులు వివిధ క్రీడాంశాలలో.. ఒలింపిక్స్ లో పాల్గొనడానికి వెళ్లారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పారిస్‌ ఒలింపిక్స్‌ 2024 మొదటి రోజు నుంచే భారత్ సత్తాచాటిందని చెప్పుకొవచ్చు. ఈరోజు 11 క్రీడాంశాల్లో వివిధ అథ్లేట్లు బరిలోకి దిగారు.  ముఖ్యంగా షూటింగ్‌లో మను బాకర్‌ అదరగొట్టిందని చెప్పుకొవచ్చు. పారిస్ ఒలింపిక్స్‌ మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ క్వాలిఫికేషన్‌లో మూడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. బ్యాడ్మింటన్‌లోనూ ..సాత్విక్‌-చిరాగ్‌ శెట్టి ద్వయంతో పాటు లక్ష్యసేన్‌ కూడా రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. కాంస్యం గెలవడంతో.. 22 ఏళ్ల మను భాకర్‌ చరిత్ర సృష్టించిందని చెప్పుకొవచ్చు. ప్రతీసారి భారత్  షూటర్లు భారీ అంచనాల నడుమ విశ్వక్రీడలకు వెళ్తుంటారు. కొన్నిసార్లు పోరాడిన కూడా పతకాలు లేకుండానే స్వదేశానికి వచ్చిన ఘటనలు ఉన్నాయి.


ఈ నేపథ్యంలో.. ఒలిపింక్స్ గేమ్ స్టార్ట్ అయిన రెండు రోజుల్లోనే భారత్ పతాకం సాధించడంపట్ల చాలా మంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. 2020 ఒలింపిక్స్‌లో భారీ అంచనాల మధ్య మూడు విభాగాల్లో పోటీ పడిన మను భాకర్.. అన్నింట్లోనూ విఫలమై వెనుదిరగాల్సి వచ్చింది. కానీ ఈసారి మాత్రం గట్టిగా కష్టపడి పోటీపడ్డ తొలి ఈవెంట్‌లోనే కాంస్య పతకాన్ని అందించింది. మరో రెండు విభాగాల్లోనూ మనూభాకర్  పోటీ పడనుందని తెలుస్తోంది.


Read more: Dream about snakes: కలలో పాములు తరచుగా కన్పిస్తున్నాయా..?.. ఇది మీకోసమే.. అస్సలు మిస్ అవ్వొద్దు..


22 ఏళ్ల మను బాకర్‌ గత టోక్యో ఒలింపిక్స్‌లో పిస్టల్‌ పనిచేయకపోవడంతో అనూహ్యంగా ఫైనల్‌కు అర్హత సాధించకుండానే నిష్క్రమించింది. కానీ ఈ సారి మాత్రం ఆమె పట్టు వదలకుండా... పూర్తి ఏకాగ్రతతో షూటింగ్‌లో పాల్గొన్న ఆమె.. ఫైనల్‌కు అర్హత సాధించి, ఫైనల్ గట్టిగా పోరాడి కాంస్యం గెలచుకుంది. ఇదిలా ఉండగా.. ఫ్రాన్స్ లోని పారిస్ వేదికగా క్రీడా సంబరం ఒలింపిక్స్‌కి జులై 26 న వేడుకగా  ప్రారంభమయ్యాయి. ప్రపంచ దేశాల నుంచి పదివేలకు పైగా అథ్లేట్లు ఈ క్రీడల్లో సత్తాచాటేందుకు బరిలోకి దిగారు. ఒలిపింక్స్ గేమ్స్ .. జులై 26 నుంచి ఆగస్టు 11 వరకూ పారిస్ ఒలింపిక్స్ జరగనున్నాయి. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి