ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( Indian premier league ) ఐపీఎల్ ( IPL ) టైటిల్ స్పాన్సర్ షిప్ నుంచి వివో తప్పుకోవడంతో..ఆ స్థానం కోసం భారతీయ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా పతంజలి సంస్థ రేసులో ముందంజలో ఉంది. పతంజలి బ్రాండ్ ను విదేశాల్లో విస్తరింపజేసేందుకు ఐపీఎల్ వేదిక అవుతుందనేది సంస్థ ఆలోచనగా ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వతేదీ వరకూ ఐపీఎల్ 2020 ( Ipl 2020 ) యూఏఈ ( UAE ) లో జరగనుంది. ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్ ( Ipl 2020 title sponsor ) గా వాస్తవానికి వివో ( Vivo ) తో ఒప్పందముంది. కానీ పలు కారణాలతో ఆ సంస్థ తప్పుకుంది. దాంతో ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నా...మరీ ముఖ్యంగా భారతీయ కంపెనీ పతంజలి సంస్థ ( Patanjali company ) రేసులో ముందంజలో ఉంది. చాలాకాలంగా విదేశాల్లో సంస్థకు చెందిన ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల్ని ( FMCG Products ) మార్కెట్ చేయాలని పతంజలి అనుకుంటోంది. బ్రాండ్ ను విదేశాల్లో విస్తరించేందుకు ఐపీఎల్ 2020 వేదికగా మారనుంది. 


త్వరలోనే బీసీసీఐ టైటిల్ స్పాన్సర్ షిప్ కోసం టెండర్లు దాఖలు చేయనుంది. అమెజాన్, బైజుస్, డ్రీమ్ 11, అన్ అకాడమీ వంటి సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. రానున్న దసరా, దీపావళి సీజన్ ల కోసం ఈ అవకాశాన్ని కచ్చితంగా ఉపయోగించుకోవాలని అమెజాన్ ( Amazon ) పట్టుదలగా ఉంది. ఇప్పుడు అమెజాన్ కు పతంజలి సంస్థతో పోటీ ఎదురుకానుంది. ప్రస్తుత కరోనా నేపధ్య ఆర్ధిక పరిస్థితుల్లో ఎవరూ 2 వందల కోట్లకు మించి బిడ్ చేయకపోవచ్చని తెలుస్తోంది. Also read: Covid-19: సెప్టెంబరు 30 వరకు రైళ్లు బంద్