Punjab Sports Minister Gurmeet Singh: ప్రపంచ కప్ 2023 వేదికలు, షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. ముఖ్యమైన మ్యాచ్‌లు అన్నింటిని అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే నిర్వహించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇక ఆతిథ్యం దక్కని ఆయా రాష్ట్రాలు బీసీసీఐపై ఫైర్ అవుతున్నాయి. రాజస్థాన్, కేరళ, పంజాబ్‌ రాష్ట్రాలకు ఈ సారి వరల్డ్ కప్ మ్యాచ్‌లను కేటాయించలేదు. పంజాబ్ క్రీడా మంత్రి గుర్మీత్ సింగ్ మీట్ హెయిర్ కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, బోర్డు కార్యదర్శి జై షాలకు గుర్మీత్ సింగ్ లేఖ రాశారు. మొహాలీలో మ్యాచ్‌లు నిర్వహించకపోవడానికి ఐసీసీ నియమాలు ఏంటి అని ప్రశ్నించారు. వేదికను ఎంపిక చేసే ముందు ఏదైనా స్టేడియాన్ని చెక్ చేశారా..? అని నిలదీశారు. మొహాలీ స్టేడియాన్ని పరిశీలించడానికి ఏ ఐసీసీ అధికారులు వచ్చారు..? అని అడిగారు. మొహాలీ క్రికెట్ స్టేడియం 1996, 2011 ప్రపంచ కప్‌లలో కొన్ని ప్రధాన మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిందని.. కానీ ఈసారి ఒక్క మ్యాచ్‌కు కూడా ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో రాజకీయ జోక్యం ఉందని ఆరోపించిన ఆయన.. బీసీసీఐని ఎవరు నడిపిస్తున్నారో అందరికీ తెలుసు అని అన్నారు. అంతకుముందే పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.


అక్టోబర్ 5 నుంచి నవంబర్ 12వ తేదీ వరకు 46 రోజుల పాటు జరిగే  ప్రపంచకప్‌లో ఫైనల్‌తో సహా మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. అన్ని మ్యాచ్‌లను 12 వేదికలలో నిర్వహించనున్నారు. ప్రపంచకప్ మ్యాచ్‌లన్నీ హైదరాబాద్, అహ్మదాబాద్, ధర్మశాల, ఢిల్లీ, చెన్నై, లక్నో, పూణే, బెంగళూరు, ముంబై, కోల్‌కతాలో జరగనున్నాయి. ప్రాక్టీస్ మ్యాచ్‌లు హైదరాబాద్‌తో పాటు గౌహతి, తిరువనంతపురంలో సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 3 వరకు నిర్వహించనున్నారు. 


తిరువనంతపురంలో ఆతిథ్యం ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ నేత శశిథరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌లోనే అత్యుత్తమ క్రికెట్‌ స్టేడియం అని చాలా మంది చెప్పే తిరువనంతపురం స్టేడియం ప్రపంచకప్‌ షెడ్యూల్‌లో లేకపోవడం నిరాశకు గురిచేస్తోందన్నారు. అహ్మదాబాద్ దేశానికి కొత్త క్రికెట్ రాజధానిగా మారుతోందని అన్నారు. కేరళకు ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు కేటాయించలేకపోయారా..? అని ప్రశ్నించారు. 2011లో నాగ్‌పూర్‌, మొహాలీలో వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరిగాయి. ఈసారి నాగ్‌పూర్‌కు కూడా ఆతిథ్య అవకాశం రాలేదు. మొహాలీ, నాగ్‌పూర్‌తో పాటు ఇండోర్, రాజ్‌కోట్, రాంచీ వంటి అనేక హైప్రొఫైల్ క్రికెట్ స్టేడియాలకు నిరాశ ఎదురైంది. 


Also Read: Pawan Kalyan Tholi Prema: పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ రీరిలీజ్.. థియేటర్‌లో ఫ్యాన్స్ రచ్చ రచ్చ  


Also Read: TS Politics: బీఆర్ఎస్‌కు భారీ షాక్.. జడ్పీ ఛైర్మన్, 56 మంది సర్పంచ్‌లు, 26 మంది ఎంపీటీసీలు గుడ్‌బై  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook