Rajasthan Royals Captain: మరికొద్ది రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2022) అట్టహాసంగా ప్రారంభం కానుంది. టోర్నీలో ఈసారి 10 టీమ్స్ ట్రోఫీ కోసం తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ లో పాల్గొననున్న ఫ్రాంచైజీలు సన్నద్ధమవుతున్నాయి. వారికి సంబంధించిన కొత్త జెర్సీలను కూడా ఫ్యాన్స్ కు పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు ఓ షాకింగ్ న్యూస్ అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ గా సంజూ శాంసన్ తొలగించడం సహా ఆ స్థానంలో యుజ్వేంద్ర చాహల్ ను ఎంపిక చేసినట్లు ఆ జట్టు అధికారికంగా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ తో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. కెప్టెన్ గా ఏ మాత్రం అనుభవం లేని చాహల్ కు జట్టు పగ్గాలు అప్పగించారా? అంటూ రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అయితే ఆ ట్వీట్ వెనుక ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.



ఈ ట్వీట్ వెనుక ఓ పెద్ద ట్విస్ట్ ఉంది. కెప్టెన్ గా చాహల్ ను నియమించింది రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం కాదు. ఆ ట్వీట్ చేసింది మరెవరో కాదు... ఆ జట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్. ఆ టీమ్ కు సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్స్ ను తెలుసుకొని తనను తాను కెప్టెన్ గా ప్రకటించుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ట్విట్టర్ ను హ్యాక్ చేసినట్లు చాహల్ ట్వీట్ చేశాడు. అయితే చాహల్ చేసిన అల్లరి చేష్టలకు అందరూ నవ్వుకుంటున్నారు. 




 


అయితే 10 వేల రీట్వీట్స్ చేస్తే రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఓపెనర్ గా జోస్ బట్లర్ తో పాటు తాను ఓపెనింగ్ బ్యాటింగ్ చేస్తానని చాహల్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ పోస్టులో బట్లర్ ను అంకుల్ అని చాహల్ సంభోధించాడు. ఈ పోస్ట్ పై సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. పలువురు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.   


Also Read: Jhulan Goswami ODI Wickets: చరిత్ర సృష్టించిన టీమ్ఇండియా క్రికెటర్ జులన్ గోస్వామి!


Also Read: IND vs ENG: వరల్డ్ కప్ లో టీమ్ఇండియాకు ఎదురుదెబ్బ.. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచులో ఓటమి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook