టీమిండియాలో మరోసారి చోటు కోసం ఎదురుచూస్తున్న యువ సంచలనం సంజూ శాంసన్ (Sanju Samson) అద్భుత ఇన్నింగ్స్‌లతో చెలరేగిపోతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో తన రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన చేసి రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) విజయాల్లో కీలకపాత్ర పోషించాడు శాంసన్. క్రీజులో నిలబడే సునాయసంగా బంతులను సిక్సర్లుగా మలచడం సంజూ శాంసన్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఫామ్‌తో సంబంధం లేకుండా అతడి బ్యాట్‌కు బంతి కనెక్ట్ అయ్యిందంటే బౌలర్ బౌండరీ వైపు చూడాల్సిందే మరి. Gautam Gambhir Vs Shashi Tharoor: ధోనీ తర్వాత సంజూ శాంసనా?.. గౌతమ్ గంభీర్ ఫైర్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెండో ఇన్నింగ్స్‌లోనూ భారీ హాఫె సెంచరీ బాదిన రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ సంజూ శాంసన్ తన పవర్ హిట్టింగ్ సీక్రెట్ వెల్లడించాడు. ‘గత ఏడాది నుంచి బ్యాటింగ్ చాలా మెరుగైంది. గతంలోలాగే ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నాను. అయితే ప్రస్తుతం మెరుగైన ప్రదర్శన చేస్తున్నాను. నా సిక్సర్ల గురించి పదే పదే అడుగుతున్నారు. ఇది నా జన్యువుల ప్రభావమని చెబుతాను. నాన్న నుంచి నాకు ఆ శక్తి వచ్చింది. మా నాన్న చాలా గట్టి మనిషి. క్రికెటర్‌గా నేను చేయాల్సిన సాధన చేశాను సత్ఫలితాలు రాబడుతున్నాను. రాజస్థాన్ రాయల్స్ విజయాల్లో భాగస్వామిని అయినందుకు సంతోషంగా ఉందని’ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు. IPL చరిత్రలోనే అత్యధిక పరుగుల ఛేజింగ్ రికార్డ్.. మళ్లీ రాజస్థానే


 


తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ లాంటి పటిష్ట జట్టుపై సంజూ శాంసన్‌ (74; 32 బంతుల్లో 1x4, 9x6) ఈ సీజన్‌లో తన తొలి హాఫ్ సెంచరీ సాధించాడు. అదే షార్జా మైదానంలోనే జరిగిన రెండో మ్యాచ్లో పంజాబ్ జట్టుపై సంజూ శాంసన్‌ (85; 42 బంతుల్లో 4x4, 7x6) మరో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. తద్వారా ఐపీఎల్‌ చరిత్రలోనే 224 పరుగుల భారీ లక్ష్యఛేదించడంలో రాజస్థాన్ జట్టులో కీలకపాత్ర పోషించాడని తెలిసిందే. Sanju Samson: రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్‌పై షేన్ వార్న్ ప్రశంసలు, ఆశ్చర్యం  


 


ఇవి కూడా చదవండి 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe