భారత క్రికెటర్ సంజూ శాంసన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో తన బ్యాట్‌తో వీరవిహారం చేశాడు. ముఖ్యంగా ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు లక్ష్యఛేదన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు సంజూ శాంసన్(85; 42 బంతుల్లో 4x4, 7x6) కీలక ఇన్నింగ్స్‌తో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సైతం అందుకున్నాడు. సంజూను ప్రశంసిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ చేసిన వ్యాఖ్యలపై భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తీవ్రంగా స్పందించడం హాట్ టాపిక్ అవుతోంది.
IPL చరిత్రలోనే అత్యధిక పరుగుల ఛేజింగ్ రికార్డ్.. మళ్లీ రాజస్థానే
శశిథరూర్ ట్వీట్‌లో ఏముంది...
‘రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన విజయం సాధించింది. సంజూ శాంసన్ నాకు ఓ దశాబ్దకాలం నుంచి తెలుసు. ధోనీ తర్వాత ఆ స్థానం నీదేనని అతడి 14వ ఏటనే చెప్పాను. ఆ రోజు ఇప్పుడు వచ్చింది. రెండు అద్భుతమైన ఐపీఎల్ ఇన్నింగ్స్‌ల ద్వారా నువ్వు ఎంత క్లాస్ ఆటగాడివో ప్రపంచానికి అర్థమైందని’ రాజస్థాన్ క్రికెటర్ సంజూ శాంసన్‌ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు శశిథరూర్.
Sanju Samson doesn’t need to be next anyone. He will be ‘the’ Sanju Samson of Indian Cricket. https://t.co/xUBmQILBXv
— Gautam Gambhir (@GautamGambhir) September 27, 2020
ఆయన అలా ట్వీట్ చేశారో లేదో మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ రంగంలోకి దిగాడు. సంజూ శాంసన్ ఎవరి తర్వాతనో ఉండాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. భారత క్రికెట్‌లో ఒకే ఒక సంజూ శాంసన్‌గా నిలిచిపోతాడని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు శశిథరూర్ ట్వీట్‌కు రీట్వీట్ చేశాడు గౌతమ్ గంభీర్.
కొందరు నెటిజన్లు సైతం గంభీర్ ట్వీట్‌ను ఆస్వాదిస్తున్నారు. సంజూ గ్రేట్ బ్యాట్స్‌మన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ధోనీ తర్వాత నువ్వే అనడం బహుశా గంభీర్‌కు నచ్చకపోవడంతోనే ఇలా ఫైర్ అయి ఉంటాడని వీరి మధ్య వివాదం తెలిసిన క్రికెట్ ఫ్యాన్స్ స్పందిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe