Rajasthan Royals: ఐపీఎల్‌-2022లో రాజస్థాన్‌ రాయల్స్ జోరుమీద ఉంది. ప్లే ఆఫ్స్‌కు అడుగు దూరంలో నిలిచింది. ఈసీజన్‌లో పడుతూ..లేస్తూ వచ్చినా ఆ జట్టు..కీలక మ్యాచ్‌లో గెలిచి రేసులో నిలిచింది. ప్రస్తుతం రాజస్థాన్‌ రాయల్స్‌ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన ఆర్‌ఆర్..8 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా..ఐదింటిలో ఓడిపోయింది. 16 పాయింట్లతోపాటు రన్‌రేట్ అధికంగా ఉండటం ఆ జట్టుకు కలిసి వచ్చే అవకాశం ఉంది. తన చివరిదైన మ్యాచ్ ఈనెల 20న చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈమ్యాచ్‌లో గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్స్‌కు వెళ్తుంది. ఒకవేళ ఓడినా..ముందుకు వెళ్లేందుకు మెండుగా అవకాశాలున్నాయి. రాజస్థాన్‌ జట్టు చివరి మ్యాచ్‌లో ఓడితే ఇతర జట్లను కలిసి వస్తుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈక్రమంలో ఆ జట్టుకు గుడ్‌న్యూస్ అందింది. రాజస్థాన్‌ రాయల్స్ విధ్వంసకర ఆటగాడు హెట్‌మైర్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం అతడు బయో-బబుల్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని ఆ జట్టు యాజమాన్యం తెలిపింది. తన భార్య పండంటి మగ బిడ్డ జన్మనిచ్చింది. ఈక్రమంలో అతడు బయో-బబుల్‌ వీడి స్వదేశానికి వెళ్లాడు. తిరిగి హెట్‌మైర్ అందుబాటులోకి రావడంతో ఆ జట్టు మరింత పటిష్ఠం అయ్యింది.


ఈ సీజన్‌లో హెట్‌మైర్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ స్థానంలో వచ్చినా..ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన అతడు 291 పరుగులు చేశాడు. ఫినిషర్‌గా మారి జట్టుకు ఉపయోగపడుతున్నాడు. చివరి ఓవర్లలో మైదానంలోకి వచ్చి సిక్సర్లు, ఫోర్లతో అలరిస్తున్నాడు. ఈసారి కప్‌ను రాజస్థాన్‌ కొట్టే అవకాశం ఉందని క్రికెట్ పండితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ జట్టు అన్ని విభాగాల్లో రాణిస్తోందని అంటున్నారు.


Also read: TDP Mahanadu: మహానాడుతో టీడీపీలో జోష్‌ వస్తుందా..చంద్రబాబు ఏమంటున్నారు..!


Also read: Revanth Reddy: రాహుల్ గాంధీ జీ..మరోసారి రండి..రేవంత్‌ రెడ్డి పిలుపు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


 


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook