Ravi Shastri Comments: రవి శాస్త్రి సంచలన వ్యాఖ్యలు.. స్పోర్ట్స్ బెట్టింగ్‌కు దేశంలో చట్టబద్దత కల్పించాలి
Ravi Shastri: భారత్‌లో స్పోర్ట్స్ బెట్టింగ్‌ను లీగల్ చేయాలని టీమ్ ఇండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. అలా చేయడం ద్వారా దేశంలోబెట్టింగ్పై నిఘా ఉంచేందుకు వీలవుతుందని తెలిపాడు.
Ravi Shastri: మాజీ క్రికెటర్, టీమ్ ఇండియా మాజీ హడ్ కోచ్ రవి శాస్త్రి బెట్టింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దేశంలో స్పోర్ట్స్ బెట్టింగ్‌ను చట్టబద్దం (Ravi Shastri on Sports Betting) చేయాలన్నాడు. అలా చేస్తే ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుందని తెలిపాడు. అదే విధంగా బెట్టింగ్‌పై నిఘా ఉంచేందుకు కూడా అవకాశం కలుగుతుందని (Betting legalization in India) అభిప్రాయపడ్డాడు.
బెట్టింగ్‌ను అణచివేయాలని ఎంత ప్రయత్నించినా.. ఏదో ఒక విధంగా అది జరుగుతూనే ఉంటుందన్నాడు రవి శాస్త్రి. బెట్టింగ్‌ను అణచివేయడానికి బదులు.. చాలా దేశాలు చట్టపరం చేసి నిఘా విధిస్తున్నట్లు చెప్పాడు. ఓ టీవీ కార్యక్రమంలో ఈ విషయంపై ప్రస్తావన రాగా ఈ విధంగా స్పందించాడు రవి శాస్త్రి.
దేశంలో జోరుగా బెట్టింగ్‌లు..
దేశంలో స్పోర్ట్స్ బెట్టింగ్ చాలా కాలంగా జోరుగా సాగుతుంది. ముఖ్యంగా క్రికెట్‌పై భారీ ఎత్తున బెట్టింగ్‌లు నడుస్తుంటాయి. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్, ఐపీఎల్ వంటి సమయాల్లో రూ.వందల కోట్లలో చేతులు మారుతుంటాయి.
బెట్టింగ్‌లను అరికట్టేందుకు పోలీసులు ఎంతగా శ్రమించినా.. వాటిని నియంత్రంచలేకపోతున్నారు. ఈ కారణంగా బెట్టింగ్‌ను లీగల్ చేయాలని అనే వాదన కొంత కాలంగా వినిపిస్తోంది. రవి శాస్త్రి కన్నా ముందు కూడా పలువురు బెట్టింగ్‌కు చట్టబద్దత కల్పించాలని సూచించారు.
ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంపై విచారణ జరిపిన కమిటీకి నేతృత్వం వహించిన విశ్రాంత జస్టిస్ ముకుల్ ముద్గల్ కూడా గతంలో ఇదే విషయాన్ని కేంద్రానికి సూచించారు. స్పోర్ట్స్ బెట్టింగ్‌కు చట్టబద్దక కల్పించాలన్నారు. ఈ చట్టాన్ని తీసుకురావడం ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా అభివర్ణించారాయన. అయితే బెట్టింగ్‌కు చట్టబద్దత కల్పిస్తే.. గేమింగ్ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.
బెట్టింగ్ చట్టబద్దతతో తీవ్ర పరిణామాలు..
బెట్టింగ్‌కు చట్ట బద్దత కల్పించాలనే డిమాండ్‌తో పాటు.. దానిని పూర్తిగా నియంత్రించాలనే డిమాండ్ కూడా పెరుగుతోంది. బెట్టింగ్‌ను లీగలైజ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బెట్టింగ్ నేరమైనందున చాలా మంది చాటుగా ఈ తతంగాన్ని నడిపిస్తున్నారని చెబుతున్నారు. ఇక చట్టబద్దత కల్పిస్తే.. చాలా మంది ఇదే పనిగా పెట్టుకునే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. అదే జరిగితేగనక బెట్టింగ్ ప్రస్తుతం ఉన్న స్థాయితో పోలిస్తే రెట్టింపయ్యే అవకాశముందని సూచిస్తున్నారు.
Also read: Harbhajan Singh: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి హర్భజన్ సింగ్?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook