విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ మధ్య విబేధాలు ప్రచారంపై స్పందించిన రవిశాస్త్రి
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ మధ్య విబేధాలు ప్రచారంపై స్పందించిన రవిశాస్త్రి
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విబేధాలు నెలకొన్నాయనే వార్తలపై స్పందించిన జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి.. జట్టులో ఆటగాళ్ల మధ్య రకరకాల అభిప్రాయాలు ఉంటుండొచ్చు కానీ వాటినే విబేధాలుగా చూడొద్దని అన్నారు. ప్రపంచ కప్ టోర్నమెంట్ నుంచి భారత నిష్క్రమించిన తర్వాత ఆ ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని రవిశాస్త్రి కొట్టిపడేశారు. ''నేను దాదాపు ఐదు సంవత్సరాలుగా డ్రెస్సింగ్ రూంలో తిరుగుతున్నాను. ఆటగాళ్ల ఆట తీరు.. వాళ్లు ఒకరినొకరు పరస్పరం అభినందించుకుంటున్న ఆట తీరు నాకు తెలుసు. వాళ్లను నేను ఎప్పటికప్పుడు దగ్గరి నుంచి చూస్తున్నాను. వాళ్లు ఎప్పుడూ విలువలకు కట్టుబడే ఉన్నారు అంటూ రవిశాస్త్రి ఆటగాళ్లను వెనకేసుకొచ్చారు. ఒకవేళ వారి మధ్య విబేధాలు ఉండుంటే.. రోహిత్ శర్మ ప్రపంచ కప్‌లో ఐదు సెంచరీలు చేసేవాడు కాదు. విరాట్ కోహ్లి ఇంత ఘనత సాధించేవాడూ కాడు. అన్నింటికిమించి వాళ్లిద్దరు అన్నిసార్లు ఆటలో మంచి భాగస్వామ్యాలు నమోదు చేసేవాళ్లు కూడా కాదు" రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.
ఒక జట్టులో 15 మంది ఆటగాళ్లు ఉన్నప్పుడు వాళ్లందరి మధ్య అన్ని సందర్భాల్లో ఏకాభిప్రాయం కుదరాలి ఏం లేదు కదా శాస్త్రి ప్రశ్నించారు. గల్ఫ్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిశాస్త్రి ఈ వ్యాఖ్యలు చేశాడు.