చెన్నై: మహేంద్ర సింగ్‌ ధోనీ ఇక క్రికెట్‌కి వీడ్కోలు చెప్పనున్నాడంటూ ఈ ఏడాది వరల్డ్ కప్ ముగిసినప్పటి నుంచి అనేక సందర్భాల్లో ఎన్నో పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. ధోనీ రిటైర్మెంట్(MS Dhoni`s retirement) ఎప్పటికప్పుడు మీడియాలోనూ ఓ హాట్ టాపిక్‌గా ఉంటూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ధోనీ రిటైర్‌మెంట్‌పై భారత క్రికెట్‌ జట్టు కోచ్‌ రవిశాస్త్రి(Ravi Shastri) పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీ ఇప్పట్లో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకోబోరంటూ ధోని భవితవ్యం గురించి చేసిన పలు వ్యాఖ్యల ద్వారా చెప్పకనే చెప్పేశాడు. ఐపీఎల్‌ 2020(IPL 2020) ధోనీ ఆట తీరు ఎలా ఉంటుందనేదానిపైనే అతడి రిటైర్‌మెంట్ ఆధారపడి ఉంటుందని రవిశాస్త్రి తేల్చేశాడు. ''టీ20 ఫార్మాట్‌లో ఐపీఎల్‌ అనేదే పెద్ద టోర్నమెంట్‌. అందుకే ఐపిల్‌లో ధోనీ ఎలా ఆడుతున్నారన్నది గమనించిన తర్వాతే టీ20 వరల్డ్‌ కప్‌ కోసం తుది జట్టును ప్రకటిస్తారు'' అని రవిశాస్త్రి చేసిన ప్రకటన ధోనీ అభిమానుల్లో మళ్లీ అతడి ఆట చూడొచ్చనే ఆశలు చిగురింపజేసేలా చేసింది. 


వచ్చే ఏడాది డిసెంబర్‌లో జరగబోయే టీ20 వరల్డ్‌ కప్‌ కోసం తుది జట్టు ఎంపికలో ధోనీని కూడా పరిగణనలోకి తీసుకుంటారని, అప్పటివరకు జాతీయ క్రికెట్‌లో ధోనీ కొనసాగుతారని రవిశాస్త్రి చెప్పకనే చెప్పడంతో ధోనీ రిటైర్‌మెంట్‌పై కూడా ఒక రకంగా ఓ క్లారిటీ వచ్చినట్టయింది. For live updates Watch ZEE Hindustan live TV