టీమ్ మేనేజ్‌మెంట్‌కు అతడి ఫామ్ తెలుసు.. మూడో టెస్టులో శుభ్‌మాన్ గిల్‌కు ఛాన్స్ ఇవ్వాలి: రవిశాస్త్రి
Ravi Shastri backs Shubman Gill for last two India vs Australia Tests. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోని చివరి రెండు టెస్టుల్లో ఓపెనర్‌గా శుభ్‌మాన్ గిల్‌కు ఛాన్స్ ఇవ్వాలి భారత మాజీ కోచ్ రవిశాస్త్రి సూచించాడు.
Ravi Shastri Wants Shubman Gill to play IND vs AUS 3rd Test as a Opener in Place of KL Rahul: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోని చివరి రెండు టెస్టుల్లో ఓపెనర్‌గా శుభ్‌మాన్ గిల్‌కు ఛాన్స్ ఇవ్వాలి భారత మాజీ కోచ్ రవిశాస్త్రి సూచించాడు. కేఎల్ రాహుల్ స్థానంలో గిల్‌కు అవకాశం ఇవాలన్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ 4-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేస్తే.. డబ్ల్యూటీసీ 2032 ఫైనల్‌లో ఆసీస్‌తో తలపడినా టీమిండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడ్డాడు. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ఇండోర్ వేదికగా మార్చి1 నుంచి ప్రారంభం కానుంది.
ఐసీసీ రివ్యూ పోడ్‌కాస్ట్‌లో రవిశాస్త్రి మాట్లాడుతూ... 'టీమ్ మేనేజ్‌మెంట్‌కు కేఎల్ రాహుల్ ఫామ్ గురించి తెలుసు. అతని మానసిక స్థితి వారికి తెలుసు. శుభ్‌మాన్ గిల్ లాంటి వారిని ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలుసు. స్వదేశంలో జరిగే ఈ సిరీస్‌కు వైస్ కెప్టెన్‌ని నియమించడం తప్పుడు నిర్ణయం. వైస్ కెప్టెన్ ఫామ్‌లో లేనప్పుడు తుది జట్టు ఎంపిక క్లిష్టతరంగా ఉంటుంది. నేను ఎప్పుడూ కూడా అత్యుత్తమ ప్లేయింగ్ XIనే ఎంచుకుంటా. వైస్-కెప్టెన్ బాగా పర్ఫామెన్స్ చేయకపోతే.. అతని స్థానాన్ని ఎవరైనా తీసుకోవచ్చు' అని అన్నాడు.
'స్వదేశంలో వైస్ కెప్టెన్‌ను నియమించడం నేను ఎప్పుడూ ఇష్టపడను. అయితే ఓవర్సీస్ వేదికపై ఇది భిన్నంగా ఉంటుంది. శుభ్‌మాన్ గిల్ లాంటి వ్యక్తి జట్టుకు అవసరం. అతను సవాల్ విసురుతాడు. కేఎల్ రాహుల్ ఇప్పుడు వైస్ కెప్టెన్ కాదు. ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలనే నిర్ణయాన్ని జట్టు యాజమాన్యం తీసుకుంటుంది' అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. కేఎల్ రాహుల్ గత ఏడు ఇన్నింగ్స్‌లలో విఫలమయ్యాడు. 22, 23, 10, 2, 20, 17 మరియు 1 స్కోర్ చేశాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మొదటి రెండు టెస్టులకు వైస్-కెప్టెన్‌గా ఉన్న రాహుల్.. చివరి రెండు గేమ్‌లకు తన స్థానాన్ని మాత్రమే నిలుపుకున్నాడు.
'బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ 4-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేస్తే.. అది ప్రత్యర్థిపై మానసికంగా ప్రభావం చూపుతుంది. అయితే ఇంగ్లండ్‌లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే గాయాలపాలై జట్టుకు దూరమైన ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు అప్పటికి తిరిగి రానున్నారు. కానీ ఈ క్లీన్‌స్వీప్ విజయం ఇంగ్లీష్ పరిస్థితుల్లో ఆసీస్‌ను ఓడించగలమనే ఆత్మవిశ్వాసం భారత్‌కు ఇస్తుంది' అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. ఇప్పటికే వరుసగా రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్.. మరో మ్యాచ్‌లో విజయం సాధిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుంది.
Also Read: IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టు.. అరుదైన రికార్డుపై కన్నేసిన ఆర్ అశ్విన్!
Also Read: Harbhaja Singh: రాహుల్ ద్రవిడ్ వద్దు.. మరో కోచ్‌ని నియమించండి: హర్భజన్ సింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.