RR VS CSK | రాజస్థాన్ ఆటగాడు జోస్ బట్లర్ ( Jose Buttler ) అదిరిపోయే పెర్ఫార్మెన్స్ వల్ల రాజస్థాన్ టీమ్ రాయల్ గా విజయం సాధించింది. ఐపీఎల్ 2020లో ( IPL 2020 ) 37వ మ్యాచు నేడు చైన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. ఇందులో చెన్నై టీమ్ నిర్ధేశించిన లక్ష్యాన్ని రాజస్థాన్ టీమ్ సునాయాసంగా చేరుకోగలిగింది. స్టీవ్ స్మిత్, జోస్ బట్లర్ జోడీ 97 పరుగులు సాధించడంతో ఈ విజయం వారికి సులువుగా సాధ్యం అయంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING



తొలూత బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి దిగిన చెన్నై టీమ్ ( CSK ) 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి కేవలం 125 పరుగులు మాత్రమే సాధించగలిగింది. 
చెన్నై స్కోర్ కార్డు చూస్తే..


  • రవీంద్ర జడేజా - 30 బంతుల్లో 34 రన్స్, ఇందులో 4 ఫోర్లున్నాయి.

  • శామ్ కరన్ -  22 పరుుగుల చేశాడు 1 ఫోర్, 1 సిక్స్

  • మహేంద్ర సింగ్  -ధోనీ   28 బంతుల్లో 28 పరుగులు 2 ఫోర్లు

  • డుప్లెసిన్ - 10 రన్స్

  • వాట్సన్ - 8 రన్స్

  • అంబటి రాయుడు-  13 రన్స్ చేశారు




రాజస్థాన్ బౌలర్ల హవా


  • జోఫ్రా ఆర్చర్ - 20 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు

  • కార్తిక్ త్యాగి -  35 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు

  • శ్రేయాస్ గోపాల్ -14 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు.

  • రాహుల్ తెవాటియా - 18 రన్స్ ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు.




 రాజస్థాన్ స్కోర్ కార్డు 
లక్ష్యం -126 పరుగులు
స్టీవ్ స్మిత్ ( 26 పరుగులు, 2ఫోర్లు ), జోస్ బట్లర్ ( 48 బంతుల్లో 70 పరుగులు 7ఫోర్లు, 2 సిక్సులు ) చక్కని ఆటతీరు కనబర్చడంతో 17.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYe