RCB vs SRH Match Highlights: ఉత్కంఠరేపిన మ్యాచ్‌లో RCB పై SunRisers Hyderabad విజయం
RCB vs SRH Match Highlights, IPL 2021 live score updates: నేడు చెన్నై సూపర్ కింగ్స్ vs పంజాబ్ కింగ్స్ జట్ల (CSK vs PBKS) మధ్య ఒక మ్యాచ్, కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ జట్ల (KKR vs RR) మధ్య మరో మ్యాచ్ జరగనుంది.
RCB vs SRH Match Highlights, IPL 2021 live score updates: ఐపీఎల్ దుబాయ్ షెడ్యూల్లో భాగంగా గత రాత్రి జరిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు vs సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించి వరుస ఓటముల భారం నుంచి బయటపడింది. మరోవైపు వరుస విజయాలతో జోష్‌మీదున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సన్ రైజర్స్ విధించిన 142 పరుగుల స్వల్ప విజయ లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమిపాలైంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 142 పరుగుల స్వల్ప విజయ లక్ష్యాన్ని ఛేధించడంలో బెంగళూరు (Royal Challengers Bengaluru) బ్యాట్స్‌మెన్ విజయం సాధించలేకపోయారు. సన్‌రైజర్స్ బౌలర్లు ప్రత్యర్థులను కట్టడి చేయడంలో సఫలమయ్యారు. అందువల్లె బెంగళూరు జట్టు చేతిలో మరో నాలుగు వికెట్లు మిగిలి ఉన్నప్పటికీ, విధ్వంసకరమైన బ్యాట్స్ మన్ ఏ.బీ. డివిలియర్స్ (ab de villiers) లాంటి ఆటగాడు క్రీజులో ఉన్నప్పటికీ ఆ జట్టు లక్ష్యాన్ని ఛేధించలేకపోయింది. నిర్ధేశించిన 20 ఓవర్లలో 137 పరుగులకే సరిపెట్టుకుని ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లలో దేవదత్ పడిక్కల్ (Devdutt Padikkal) 52 బంతుల్లో 4 ఫోర్లతో 41 పరుగులు చేయగా, మ్యాక్స్‌వెల్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. యూనివర్శల్ బ్యాట్స్‌మన్ ఏ.బి. డివిలియర్స్ 19 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివరి ఓవర్‌లో బెంగళూరు జట్టు విజయానికి 13 పరుగులు అవసరం అయ్యాయి. తొలి మూడు బంతుల్లో మూడు పరుగులే రావడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ (SunRisers Hyderabad) కొంత సేఫ్ సైడ్ లో కనిపించింది.
Also read: IPL 2021: ప్రాక్టీస్ వీడియో పోస్ట్ చేసిన కోహ్లీ... కన్నుల పండగ్గా ఉందన్న ఆఫ్రిది
అయితే, భువనేశ్వర్ కుమార్ విసిరిన నాలుగో బంతికి డివిలియర్స్ (ab de villiers) సిక్స్ కొట్టడంతో మళ్లీ సస్పెన్స్ మొదటికొచ్చింది. కానీ భువి ఈసారి మరింత పకడ్బందీగా వ్యవహరించడంతో మిగతా రెండు బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. ఫలితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ నాలుగు పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై (SRH beat RCB) విజయం సాధించింది. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, జేసన్ హోల్డర్, సిద్ధార్థ్ కౌల్, ఉమ్రాన్ మాలిక్, రషీద్ ఖాన్ చెరో వికెట్ తీసుకున్నారు.
నేడు చెన్నై సూపర్ కింగ్స్ vs పంజాబ్ కింగ్స్ జట్ల (CSK vs PBKS) మధ్య ఒక మ్యాచ్, కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ జట్ల (KKR vs RR) మధ్య మరో మ్యాచ్ జరగనుంది.
Also read: రోహిత్ శర్మ అరుదైన ఘనత..టీ20ల్లో 400 సిక్స్‌లు కొట్టిన తొలి భారత ఆటగాడిగా రికార్డు
Also read : RR vs MI IPL 2021 Match: రాజస్థాన్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని చిత్తు చేసిన Mumbai Indians
Also read: IPL 2021 Points table today: ఐపిఎల్ 2021 పాయింట్స్ పట్టికలో ఎవరు టాప్, ఎవరు ఫ్లాప్ ?
Also read : DC vs CSK match highlights: ఉత్కంఠభరితమైన పోరులో చెన్నైపె గెలిచిన ఢిల్లీ.. IPL 2021 లో అగ్రస్థానం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook