360 డిగ్రీస్ ప్లేయర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్ (AB de Villiers) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) లో అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో 4500 పరుగులు పూర్తి చేసుకున్నాడు. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో సోమవారం జరిగిన ఈ సీజన్ 10వ ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై డివిలియర్స్ అర్ధ శతకం సాధించాడు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో 4500 పరుగుల మార్క్ చేరుకున్న రెండో విదేశీ క్రికెటర్‌గా నిలిచాడు డివిలియర్స్ (AB de Villiers 4500 IPL Runs). గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఒక్కడే ఈ ఫీట్ సాధించిన ఏకైక క్రికెటర్‌గా ఉన్నాడు.
గత 9 ఏళ్లుగా ఆర్సీబీకి డివిలియర్స్ ప్రాతినిథ్యం వహిస్తూ జట్టు విజయాల్లో కీలక భాగస్వామిగా ఉన్నాడు. ఐపీఎల్లో ఓవరాల్‌గా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సురేష్ రైనా, డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్‌లు 4500 పరుగుల మార్క్ అధిగమించగా.. తాజాగా ఈ జాబితాలోకి డివిలియర్స్ వచ్చి చేరాడు. డివిలియర్స్ ఇప్పటివరకూ 157 ఐపీఎల్ మ్యాచ్‌లడి 4,529 పరుగులు సాధించాడు.
కాగా, ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 24 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లు బాదిన డివిలియర్స్ 55 పరుగులు సాధించాడు. మూడు మ్యాచ్‌లాడిన ఆర్సీబీ జట్టు రెండు విజయాలు సాధించి దూసుకెళ్తోంది. ముంబైతో మ్యాచ్ టై కాగా సూపర్ ఓవర్లో ఆర్సీబీ విజయాన్ని అందుకుందని తెలిసిందే.