Rohit Sharma Completed 400 Sixes In T20s: హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. టీ20ల్లో 400 సిక్స్‌లు(Sixes) కొట్టిన ఏకైక భారత ఆటగాడిగా రోహిత్(Rohit Sharma) రికార్డు సృష్టించాడు. రోహిత్ తర్వాత 325 సిక్సర్లతో సురేశ్ రైనా, 320 సిక్సర్లతో విరాట్ కోహ్లి, 304 సిక్సర్లతో ఎంఎస్ ధోని తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మంగళవారం రాజస్తాన్ రాయల్స్(Rajastan royals)తో జరిగిన మ్యాచ్‌లో రెండు సిక్సర్‌లు బాదిన రోహిత్ శర్మ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. మొత్తంగా చూస్తే 1042 సిక్సర్లతో క్రిస్ గేల్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.
తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్(Mumbai Indians), రాజస్థాన్ రాయల్స్ పై ఘన విజయం సాధించింది. ఇషాన్ కిషన్ అర్ధ సెంచరీతో చేలరేగడంతో ముంబై లక్ష్యాన్ని చేధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన రాజస్తాన్ ముంబై బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 90 పరుగులకే పరిమితమైంది. ముంబై బౌలర్లలో నాథన్ కౌల్టర్-నైల్ నాలుగు వికెట్లు సాధించగా, జేమ్స్ నీషమ్ 3 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు.
Also Read: RR vs MI IPL 2021 Match: రాజస్థాన్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని చిత్తు చేసిన Mumbai Indians
అనంతరం 91 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ దూకుడగా ఆడారు. 22 పరుగులు చేసిన రోహిత్, చేతన్ సకారియా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా దూకుడుగా ఆడాడు. చివరకి ఇషాన్ కిషన్ సిక్సర్ల మోత మోగించడంతో ముంబై కేవలం 8.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. దీంతో ముంబై ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. కాగా ఈ ఓటమితో రాజస్తాన్ ప్లేఆప్ రేసు నుంచి నిష్క్రమించింది. 13 మ్యాచులు ఆడిన ఏడు మ్యాచుల్లో ఓడిపోయి.. ఆరింటిలో విజయం సాధించింది. 12 పాయింట్లతో జాబితాలో ఐదో స్థానంలో నిలించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook