ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను తన సెన్సేషనల్ ఇన్నింగ్స్‌తో విండీస్ ఆటగాడు బ్రావో గెలిపించిన విషయం తెలిసిందే. కానీ ఇదే మ్యాచ్‌లో మరో ఆసక్తికరమైన విషయం ఉంది. అదేమిటంటే.. చెన్నై టీమ్‌కు చెందిన బ్రావో, ప్రత్యర్థి ముంబై ఇండియన్స్‌కు చెందిన కీరన్ పొలార్డ్ ఒకే నంబర్ జెర్సీ వేసుకున్నారు. అదే 400 నంబర్ జెర్సీ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో విండీస్ స్టార్ డ్వేన్ బ్రావో 400 నెంబర్ జెర్సీ వేసుకోవడం వెనుక ఓ కారణం ఉందట. టీ20లో 400 వికెట్లు తీసిన తొలి బౌలర్ తాను అని.. దీనికి గుర్తుగానే ఈ నెంబర్ జెర్సీ వేసుకున్నట్లు బ్రేవో చెప్పాడు. ఇక ఫార్మాట్‌లో 400 టీ20మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడు పొలార్డ్. కాగా.. ఈ ఇద్దరూ ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఆడితే ఇద్దరూ ఇదే నెంబర్ జెర్సీ వేసుకోవాలని ముందే నిర్ణయించుకున్నారట. మా ఇద్దరికీ ఇది గొప్ప మైలురాయి. నేను నా టీమ్‌తో, పొలార్డ్ ముంబై టీమ్‌తో మాట్లాడాడు. రెండు టీమ్స్ ఒకే నంబర్ జెర్సీకి అంగీకరించాయి.


మిగితా మ్యాచ్‌లలో బ్రావో 47, పోలార్డ్ 55 నెంబర్ జెర్సీలతో ఉంటారు. 30 ఏళ్లు పైబడిన తాను తన ఆటతీరును మార్చుకున్నానని, మొదట్లో నెమ్మదిగా మొదలుపెట్టి.. క్రమంగా వేగం పెంచానని బ్రావో  చెప్పాడు. బ్రేవో తన ఇన్నింగ్స్‌లో మొత్తం 7 సిక్సర్లు, మూడు ఫోర్లు కొట్టాడు. 68 పరుగులు చేసి సీఎస్‌కే విజయానికి తోడ్పడ్డ బ్రావోకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.