Rishabh Pant likely to miss IPL 2023 and Australia Test series, KS Bharat replace Pant: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి తన స్వస్థలమైన రూర్కికి వెళ్తూ.. శుక్రవారం (డిసెంబర్ 30) తెల్లవారుజామున 5.30 గంటలకు ప్రమాదం భారిన పడ్డాడు. పంత్ ప్రయాణిస్తున్న కారు ఢిల్లీ-డెహ్రాడూన్ జాతీయ రహదారిలో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. కారు పల్టీలు కొట్టిన కాసేపటికే మంటలు చెలరేగడంతో.. అటుగా వెళుతున్న ఓ బస్సు డ్రైవర్‌, మరికొందరి సాయంతో కారు అద్దం నుంచి పంత్ బయటపడ్డాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కారు యాక్సిడెంట్‌కు గురైన‌ రిష‌బ్ పంత్.. ప్ర‌స్తుతం డెహ్రాడూన్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ముఖం మీద అయిన గాయాలకు మ్యాక్స్‌ ఆసుపత్రిలో ప్లాస్టిక్‌ సర్జరీ చేసినట్లు డిల్లీ క్రికెట్‌ అసోసియేషన్ డైరెక్టర్‌ శ్యామ్‌ పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే పంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, అతను స్పృహలో ఉన్నాడని మ్యాక్స్ వైద్యులు చెప్పారు. అయితే పంత్ కుడి చేయి, కాలుకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. అలాగే నుదుటిపై, కంటికి సమీపంలో కూడా తీవ్రంగా దెబ్బలు తగిలాయి. పంత్‌కు తీవ్ర గాయాలు కావ‌డంతో అత‌ను ఎప్పుడు కోలుకుంటాడో చెప్ప‌లేని ప‌రిస్థితి ఉంది. 


లిగ‌మెంట్ గాయం నుంచి రిషబ్ పంత్ కోలుకోవాలంటే.. క‌నీసం 3 నుంచి 6 నెల‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని వైద్యులు తెలిపారు. ఒక‌వేళ నొప్పి తీవ్రంగా ఉంటే.. మ‌రింత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌న్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో జ‌రిగే టెస్టు సిరీస్‌కు పంత్ దూరం కానున్నాడు. ఇదే నిజమయితే తెలుగు ఆటగాడు కేఎస్ భ‌ర‌త్‌కు వికెట్ కీపింగ్ బాధ్య‌త‌లు ద‌క్కే అవ‌కాశాలు ఉన్నాయి. అలానే ఐపీఎల్‌ 2023కే కూడా రిషబ్ దూరం కానున్నాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ర‌పున పంత్ ఆడుతున్నాడు. డేవిడ్ వార్నర్ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 


Also Read: 1.5 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించిన భారతీయ కంపెనీ.. సక్సెస్‌కు అసలు కారణాలు ఇవే!


Also Read: Budh Margi 2023: బుధుని ప్రత్యక్ష సంచారం.. ఈ రాశుల వారు కొత్త సంవత్సరంలో నోట్ల కట్టలతో ఆడుకుంటారు!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.