Rishabh Pant Health Update: రిషబ్ పంత్ పరిస్థితి విషమం.. విమానంలో ఢిల్లీకి తరలింపు?
Indian Cricketer Rishabh Pant Health Update from DDCA. ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్ శర్మ.. భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ గురించి తాజాగా ఓ అప్‌డేట్ ఇచ్చారు. ఈ వార్త కాస్త ఆందోళన కలిగించేదేలా ఉంది.
Rishabh Pant may airlift to Delhi for plastic surgery says DDCA: నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి తన స్వస్థలమైన రూర్కికి వెళ్తూ.. భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదంకు గురైన విషయం తెలిసిందే. శుక్రవారం (డిసెంబర్ 30) తెల్లవారుజామున 5.30 గంటలకు పంత్ ప్రయాణిస్తున్న కారు ఢిల్లీ-దేెహ్రాడూన్ జాతీయ రహదారిలో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. కారు పల్టీలు కొట్టిన కాసేపటికే మంటలు చెలరేగడంతో.. ఓ బస్సు డ్రైవర్, మరికొందరి సాయంతో కారు అద్దం నుంచి పంత్ బయటపడ్డాడు. అప్పటికే తీవ్ర గాయాలు అయిన పంత్.. నడవలేని స్థితిలో ఉన్నాడు.
గాయాల పాలైన రిషబ్ పంత్‌ను అక్కడున్న వారు ముందుగా హరిద్వార్‌లోని మంగ్లోర్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర చికిత్స అనంతరం దేెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పంత్‌కు మ్యాక్స్ ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. రిషబ్ ఆరోగ్యంపై నిన్ననే బీసీసీఐ ఓ అప్‌డేట్ ఇచ్చింది. గాయాలు అయినా పంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొంది. అయితే ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్ శర్మ.. పంత్ గురించి తాజాగా ఓ అప్‌డేట్ ఇచ్చారు. ఈ వార్త కాస్త ఆందోళన కలిగించేదేలా ఉంది.
'ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఒక బృందం రిషబ్ పంత్ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి మాక్స్ హాస్పిటల్‌కు వెళుతోంది. అవసరమైతే మేము అతనిని మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలిస్తాము. కాలికి అయిన ఫ్రాక్చర్ పెద్దదిగానే ఉందని తెలిసింది. ప్లాస్టిక్ సర్జరీ కోసం పంత్‌ను విమానంలో ఢిల్లీకి తరలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే పంత్ ఆరోగ్యంపై ఇప్పుడు చెప్పడం కష్టం. ఈరోజు అతడికి అనేక పరీక్షలు జరగనున్నాయి. రిషబ్ తల్లి మరియు అతని స్నేహితులు కొందరు ఆసుపత్రిలో ఉన్నారు' అని శ్యామ్ శర్మ ఓ జాతీయ మీడియాతో తెలిపారు.
కారు ప్రమాదంలో తగిలిన తీవ్ర గాయాన్ని చూస్తుంటే.. రిషబ్ చాలా కాలం క్రికెట్‌కు దూరంగా ఉంటాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గాయంపై బీసీసీఐ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దీన్నిబట్టి చూస్తే.. రిషబ్ మైదానంలోకి దిగడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. ప్రస్తుతం రిషబ్ డెహ్రాడూన్ మాక్స్ హాస్పిటల్‌లో 48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉన్నాడు. ఆర్థో మరియు న్యూరో వైద్యులు ఎప్పటికప్పుడు అతడిని పర్యవేక్షిస్తాయి. ఈరోజు మెడికల్ రిపోర్ట్స్ అనంతరం పూర్తి వివరాలు అందే అవకాశం ఉంది.
Also Read: Cheap Maruti Brezza Cars: న్యూ ఇయర్ ధమాకా ఆఫర్.. రూ. 3.8 లక్షలకే మారుతి బ్రీజా!
లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.