T20 World Cup 2021: Ajit Agarkar about Rohit Sharma, KL Rahul and Shikhar Dhawan: టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నమెంట్‌లో ఓపెనర్స్ రేసులో శిఖర్ ధావన్ కంటే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్ అభిప్రాయపడ్డాడు. టీ20 వరల్డ్ కప్ 2021 ఓపెనర్స్ రేసులో రోహిత్ శర్మకు చోటు ఖాయం. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇక కేఎల్ రాహుల్‌ని అధిగమించి అతడి స్థానాన్ని కైవసం చేసుకోవాలంటే శ్రీలంకతో జరగనున్న సిరీస్‌లో (Ind vs SL series 2021) శిఖర్ ధావన్ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాల్సిన అవసరం ఉందని భావిస్తున్నట్టు అజిత్ అగార్కర్ పేర్కొన్నాడు. సోనీ స్పోర్ట్స్‌కి ఇచ్చిన వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్సులో అజిత్ అగార్కర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో రాహుల్ అంతగా రానించలేదు. కాకపోతే టి20 క్రికెట్‌లో రాహుల్ తన పర్‌ఫార్మెన్స్ కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతానికి అదే అతడికి కలిసొచ్చే అంశం. ఇక శిఖర్ ధావన్ విషయానికొస్తే.. టీ20 క్రికెట్ ఫార్మాట్‌లో ధావన్ తనను తాను మెరుగుపర్చుకుంటున్నాడు. షార్ట్ ఫార్మాట్‌లో స్ట్రైక్ రేటు పెంచుకుంటున్న ధావన్ ఐపిఎల్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 618 పరుగులు చేసి తమ జట్టు ఫైనల్స్‌కి వెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. ఐపిఎల్ 2021 (IPL 2021) అర్థాంతరంగా వాయిదా పడే వరకు కూడా ధావన్ మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. 


Also read : SL vs IND 2021: Hardik Pandya బౌలింగ్ చేస్తే Virat Kohli జాబ్ ఈజీ: అజిత్ అగార్కర్


ఈ నేపథ్యంలోనే టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నమెంట్‌లో ఓపెనర్స్ రేసులో శిఖర్ ధావన్ స్థానం గురించి అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. ''ధావన్ తన స్థానాన్ని తిరిగి సొంతం చేసుకోవాలంటే శ్రీలంకతో సిరీస్‌లో (SL vs Ind series 2021) పరుగుల వరద పారించాల్సిందే'' అని అభిప్రాయపడ్డాడు.


Also read : MS Dhoni New Look: చిన్ననాటి స్నేహితులతో ఎంఎస్ ధోనీ లంచ్, సోషల్ మీడియాలో ఫొటో వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook