Rohit Sharma in Ind vs Eng: రోహిత్ శర్మకు, హార్థిక్ పాండ్యకు కోపం తెప్పించిన షమీ.. వీడియో వైరల్
Rohit Sharma in Ind vs Eng: ఒకవైపు ఇంగ్లండ్ ఆటగాళ్లు జాస్ బట్లర్, అలెక్స్ హేల్స్ రెచ్చిపోయి ఆడుతుండగా.. మరోవైపు టీమిండియా ఆటగాళ్లలో అక్కడక్కడ ఫీల్డింగ్ లోపాలు కనిపించాయి. ముఖ్యంగా రోహిత్ శర్మకు మొహ్మద్ షమీ బాగా కోపం తెప్పించిన క్షణం ఏదంటే..
Rohit Sharma in Ind vs Eng: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ శర్మకు పట్టరాని కోపమొచ్చింది. టీమిండియా పేసర్ మొహమ్మద్ షమి చెత్త ఫీల్డింగ్ రోహిత్ శర్మను కోపోద్రిక్తుడిని చేసింది. హార్ధిక్ పాండ్య 33 బంతుల్లో 66 పరుగులు చేసి టీమిండియా 168 పరుగుల స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించగా.. ఇంగ్లాండ్ ఆటగాళ్లలో జాస్ బట్లర్ (80), అలెక్స్ హేల్స్ (86) ఇద్దరే కలిసి 166 పరుగుల భాగస్వామ్యంతో ఇంగ్లండ్ జట్టును గెలిపించి ఫైనల్ కి చేర్చడంలో సక్సెస్ అయ్యారు.
ఒకవైపు ఇంగ్లండ్ ఆటగాళ్లు జాస్ బట్లర్, అలెక్స్ హేల్స్ రెచ్చిపోయి ఆడుతుండగా.. మరోవైపు టీమిండియా ఆటగాళ్లలో అక్కడక్కడ ఫీల్డింగ్ లోపాలు కనిపించాయి. ముఖ్యంగా రోహిత్ శర్మకు బాగా కోపం తెప్పించిన క్షణం ఏదంటే.. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ జరుగుతుండగా 9వ ఓవర్లో మొహమ్మద్ షమి చేసిన ఓ రాంగ్ ఫీల్డింగ్ స్టంట్ కారణంగా జాస్ బట్లర్, అలెక్స్ హేల్స్ 4 పరుగులు దండుకున్నారు. ఫైన్ లెగ్ లో ఫీల్డింగ్ చేసిన షమీ వైపు బౌండరీ లైన్ వద్ద ఓ బంతిని అడ్డుకున్నాడు. అయితే ఆ బంతిని నేరుగా కీపర్ కి విసరకుండా అదే బంతివైపు దూసుకొచ్చిన మరో ఫీల్డర్ భువనేశ్వర్ కుమార్ వైపు విసిరాడు. అది కూడా భువి చేతికి అందేలా కాకుండా బంతి అతడి పై నుంచి వెనక్కి వెళ్లిపోయింది. ఈ గ్యాప్ లో మొహమ్మద్ షమి అందించిన అవకాశాన్ని చేజార్చుకోకుండా అప్పటికే రెండు సింగిల్స్ తీసిన జాస్ బట్లర్, అలెక్స్ హేల్స్ మరో రెండు పరుగులు ఎక్స్‌ట్రా తీశారు.
మొహమ్మద్ షమి ఫీల్డింగ్ స్టంట్ చూసిన రోహిత్ శర్మకు పట్టరాని కోపమొచ్చింది. తన కోపాన్ని తన చేతల్లో దాచుకోకుండా ఉండలేకపోయాడు. రోహిత్ శర్మ రియాక్షన్స్ కెమెరా లెన్స్‌లో స్పష్టంగా కనిపించాయి. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా సైతం మొహమ్మద్ షమి వైఖరిపై తీవ్ర అసహనానికి గురయ్యాడు.
మొహ్మద్ షమి ఫీల్డింగ్ చూసి అసహనానికి గురైన హార్థిక్ పాండ్య ( Hardik Pandya ) ముఖ కవళికలు కూడా మ్యాచ్ చూస్తోన్న స్పెక్టేటర్స్ కంట్లో పడకపోలేదు. ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలైన టీమిండియా సెమీ ఫైనల్ మ్యాచ్‌తోనే వెనుదిరిగి రావాల్సి రావడం వెనుకున్న కారణాలను వెతుక్కునే క్రమంలో ఇలాంటివన్నీ హైలైట్ అవుతున్నాయి.
Also Read : Hardik Pandya: హార్ధిక్ పాండ్యా వికెట్.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇలా..
Also Read : Ind Vs Eng: భారత్ గెలవాలని కోరుకుంటున్న పాకిస్థాన్ బ్యూటీ.. వీడియో వైరల్
Also Read : IND vs ENG: భారత్ హిస్టరీ చూసి భయపడుతున్న పాకిస్తాన్ ఫ్యాన్స్.. ఇంగ్లండ్ గెలవాలంటూ ప్రార్థనలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook