Hardik Pandya Hit Wicket: టీ20 వరల్డ్ కప్‌లో రెండో సెమీ ఫైనల్లో టీమిండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య రసవత్తర పోరు జరుగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఫీల్డింగ్ ఎంచుకోడంతో భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. విరాట్ కోహ్లీ (50) మరో అర్ధసెంచరీ సాధించగా.. ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా (63) వీరవిహారం చేశాడు. దీంతో 20 ఓవర్లలో 168 పరుగులు చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరుకున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3, వోక్స్, రషీద్ చెరో వికెట్ తీశారు.
కేవలం 33 బంతుల్లోనే 63 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా.. 4 ఫోర్లు, 5 సిక్సర్లతో వీరవిహారం చేశాడు. ముఖ్యంగా చివరి మూడు ఓవర్లలో చెలరేగి ఆడాడు. దీంతో 18 బంతుల్లోనే 47 పరుగులు పిండుకుంది భారత్. అయితే ఇన్నింగ్స్ చివరి బంతికి పాండ్యా హిట్ వికెట్ రూపంలో ఔట్ అయ్యాడు. జోర్డాన్ వేసిన ఈ ఓవర్‌లో చివరి బాల్‌ను బౌండరీకి తరలించాడు. కానీ అతని కాలు వికెట్లకు తాకడంతో ఔట్ అయిపోయాడు.
ఈ క్రమంలోనే హార్ధిక్ పాండ్యా ఓ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఏ ఫార్మాట్‌లో అయినా ఇన్నింగ్స్ చివరి బంతికి ఔట్ అయిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇప్పటివరకు ఏ బ్యాట్స్‌మెన్ కూడా ఇన్నింగ్స్ ఆఖరి బంతికి హిట్ వికెట్ అయిన దాఖలాలు లేవు. ఫస్ట్ టైమ్ పాండ్యా ఇలా ఔట్ అయ్యాడు.
హార్ధిక్ పాండ్యా గత మ్యాచ్‌లోనూ హిట్ వికెట్ అయ్యాడు. అయితే ఆ బాల్ ఫ్రీ హిట్ కావడంతో బతికిపోయాడు. జింబాబ్వేతో జరిగిన ఆ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో ఫ్రీహిట్‌ను భారీ షాట్ కొట్టేందుకు యత్నించగా.. తన కాలు వికెట్లను తాకింది. హిట్ వికెట్ ఔట్ అయినా.. ఫ్రీహిట్ కావడంతో నాటౌట్‌గా మిగిలాడు. తరువాత బెయిల్స్ తీసుకుని వికెట్లపై ఉంచి.. బ్యాటింగ్ కొనసాగించాడు. కానీ ఆ తరువాత బంతికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు. తాజాగా ఇప్పుడు మరోసారి హార్ధిక్ పాండ్యా హిట్ కావడం విశేషం.
Also Read: Ravindra Jadeja: భార్యకు ఎమ్మెల్యే టికెట్ దక్కడంపై రవీంద్ర జడేజా హ్యాపీ.. ట్విట్టర్‌లో సందేశం
Also Read: Pawan Kalyan: ముళ్లును ముళ్లుతోనే తీసినట్లు.. వేమన విగ్రహం తొలగింపుపై పద్యం రూపంలో పవన్ కౌంటర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook