ఆసీస్ గడ్డపై రోహిత్ సరికొత్త రికార్డు సృష్టించాడు. సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో సెంచరీతో కదం తొక్కిన రోహిత్ తన ఖాతాలో 22వ సెంచరీలో నమోదు చేసుకున్నాడు. కాగా ఆసీస్ గడ్డపై రోహిత్ కి ఇది 7వ సెంచరీ. దీంతో ఆస్ట్రేలియా గడ్డ పై అత్యధిక వన్డే  సెంచరీలు సాధించిన రెండో క్రికెటర్‌గా రోహిత్‌ నిలిచాడు. రోహిత్‌ శర్మ కంటే ముందు ఆసీస్‌పై అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్‌ టెండూల‍్కర్‌ తొలి స్థానంలో  ఉన్నాడు. ఆసీస్‌పై సచిన్‌ 9వన్డే సెంచరీలు సాధించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గంగులీ రికార్డును సమం చేసిన రోహిత్


ఇదే సందర్భంలో రోహిత్ మరో రికార్డును సమం చేశారు. వన్డేల్లో 22 సెంచరీలు చేసిన రోహిత్ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ రికార్డును సమం చేశారు. వన్డే క్రికెట్ లో 22 సెంచరీలు చేసిన వారిలో శ్రీలంక ఆటగాళ్లు దిల్షాన్, తిలకరత్నే ఉన్నారు. దీంతో రోహిత్  వీళ్ల రికార్డును కూడా సమం చేసినట్లయింది. రోహిత్ మరో సెంచరీ చేస్తే దాదా (గంగూలీ ) రికార్డును బద్దలు కొట్టినట్లవుతుంది.