Rohit Sharma: రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. క్రికెట్ చరిత్రలో కెప్టెన్‌గా `ఒకే ఒక్కడు`!!
Rohit Sharma creates history as captain. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు. మూడు ఫార్మాట్లలో ఫుల్ టైమ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి సిరీస్‌ల్లోనే క్లీన్ స్వీప్ విజయాలు అందుకున్న తొలి సారథిగా రికార్డుల్లోకి ఎక్కాడు.
Rohit Sharma creates history as captain: రోహిత్ శర్మ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముందుగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా జట్టులోకి వచ్చిన రోహిత్.. ఆపై స్టార్ ఓపెనర్‌గా మారాడు. వన్డేల్లో ఎవరికీ సాధ్యంకాని రీతిలో మూడు డబుల్ సెంచరీలు బాదాడు. ఇక ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్ ప్రాంచైజీకి కెప్టెన్‌గా మారాక అతడి తలరాతే మారిపోయింది. ఏకంగా ఐదు ట్రోఫీలు గెలిచి అత్యంత విజయవంతమైన నాయకుడిగా పేరుగాంచాడు. అదే జోరును భారత జట్టులో కూడా కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకానీ ఓ రికార్డును రోహిత్ తన పేరుపై లికించుకున్నాడు.
సోమవారం శ్రీలంకపై సాధించిన టెస్ట్ సిరీస్ విజయం ద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు. మూడు ఫార్మాట్లలో ఫుల్ టైమ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి సిరీస్‌ల్లోనే క్లీన్ స్వీప్ విజయాలు అందుకున్న తొలి సారథిగా రోహిత్ రికార్డుల్లోకి ఎక్కాడు. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన డేనైట్ టెస్ట్‌లో టీమిండియా 238 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. టెస్ట్‌ల్లో కెప్టెన్‌గా హిట్‌మ్యాన్‌ను ఇదే ఫస్ట్ సిరీస్.
ప్రపంచకప్ 2021 అనంతరం విరాట్ కోహ్లీ స్వయంగా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు బీసీసీఐ వన్డే సారథ్యం నుంచి అతడిని తప్పించింది. ఇక దక్షిణాఫ్రికా సిరీస్ ఓటమి అనంతరం టెస్ట్ సారథ్య బాధ్యతల నుంచి కోహ్లీ తప్పుకున్నాడు. దాంతో రోహిత్ శర్మ టీమిండియా ఫుల్ టైమ్ కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాడు. ఫుల్ టైమ్ కెప్టెన్‌గా రోహిత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంతగడ్డపై వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లను 3-0తో భారత్ క్లీన్ స్వీప్ చేసింది. శ్రీలంకతో టీ20 సిరీస్‌ను 3-0తో గెలిచిన రోహిత్ సేన.. తాజాగా టెస్ట్ సిరీస్‌ను 2-0తో గెలిచింది. దాంతో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి సిరీస్‌ల్లోనే క్లీన్ స్వీప్ విజయాలు అందుకున్న తొలి సారథిగా హిట్‌మ్యాన్ అరుదైన గుర్తింపు సాధించాడు.
ఇటీవల కాలంలో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. 2021-22 సీజన్‌లో సొంతగడ్డపై జరిగిన ఒక్క సిరీస్‌లోనూ టీమిండియా ఓడిపోలేదు. నాలుగు టెస్టుల్లో మూడింట్లో విజయం సాధించి.. ఒక మ్యాచును డ్రాగా ముగించింది. శ్రీలంకతో జరిగిన డేనైట్ టెస్టులో గెలుపొందడం ద్వారా భారత్ సొంతగడ్డపై వరుసగా 15వ టెస్టు విజయం నమోదు చేసింది. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లో 3 వన్డేలు, 9 టీ20 మ్యాచుల్లో విజయాలు అందుకుంది.
Also Read: Shivam Sharma: అమ్మ స్నేహితురాలితో బెడ్ షేర్ చేసుకున్నా.. క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!!
Also Read: Pawan Kalyan: ఆనాడు గాడిదలు కాసావా?.. పందుల దొడ్లో పడుకున్నావా?! పవన్‌పై ఏపీ మంత్రి ఫైర్!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook