Rohit Sharma Cried After India defeated by England in T20 World Cup 2022 Semifinal: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ 2022లో భారత్‌ కథ ముగిసింది. గురువారం జరిగిన సెమీస్‌ పోరులో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా చిత్తుచిత్తుగా ఓడింది. బౌలింగ్‌లో ఘోరంగా విఫలమైన భారత్.. ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓడిపోవడం విశేషం. భారత్‌ నిర్దేశించిన 169 పరుగుల లక్ష్య ఛేదనను ఇంగ్లీష్ జట్టు ఒక్క వికెట్‌ కూడా నష్టపోకుండా 16 ఓవర్లలోనే పూర్తి చేసింది. ఇంగ్లండ్‌ను ఓడించి పాక్‌ను భారత్ ఫైనల్లో ఢీ కొడుతుందని భావించిన టీమిండియా అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెమీస్ మ్యా‌చ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా (63; 33 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), విరాట్ కోహ్లీ (50; 40 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్ సెంచరీలు బాదారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య చేధనలో ఇంగ్లండ్ 16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 170 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు జోస్ బట్లర్ (80 నాటౌట్; 49 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), అలెక్స్ హేల్స్ (86 నాటౌట్; 47 బంతుల్లో4 ఫోర్లు, 7 సిక్స్‌లు) చెలరేగారు. 



భారత్ టీ20 ప్రపంచకప్‌ 2022 టోర్నీ నిష్రమించడంతో.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ భావోద్వేగానికి లోనయ్యాడు. మ్యాచ్‌ అనంతరం డగౌట్‌లో కూర్చోని కన్నీరు పెట్టుకున్నాడు. బయటికి వస్తున్న దుఃఖాన్ని బిగపట్టుకుని మరీ.. కన్నీరు తుడ్చుకున్నాడు. మ్యాచ్ అనంతరం రోహిత్ మొహం మొత్తం వాడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోస్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇవి చూసిన ఇండియన్ ఫాన్స్ కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. 



Also Read: Hardik Pandya: హార్ధిక్ పాండ్యా వికెట్.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇలా..   


Also Read: Naga Shaurya Marriage: నాగశౌర్య పెళ్లి ఫిక్స్.. మరో పది రోజుల్లోనే... అమ్మాయి ఎవరంటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook