ఇండియన్ క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవలి కాలంలో తన ఇన్‌స్టాగ్రాం అకౌంట్ ద్వారా ఓ చిత్రమైన వీడియోని తన అభిమానులతో పంచుకున్నారు. ఒకవైపు ఏలియన్ బొమ్మ డ్యాన్స్ చేస్తున్న వీడియో పెట్టి.. అచ్చం దానిలాగే తాను కూడా డ్యాన్స్ చేసి ఆ వీడియోని కూడా పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఐపీఎల్ ప్రాక్టీసు సెషన్లలో పాల్గొనడం కోసం ముంబయిలోని వాంఖడే స్టేడియలో సేదతీరుతున్నాడు ఈ యంగ్ క్రికెటర్.


ముంబయి ఇండియన్స్ తరఫున ఆడుతున్న రోహిత్‌ను గతంలోలాగే ఈ సారి కూడా గెలుపు గుర్రం వరిస్తుందో లేదో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే. ఈ సారి ముంబయి ఇండియన్స్ తన తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఏప్రిల్ 7వ  తేది నుండి ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది. రోహిత్ శర్మ ఇప్పటికి తన కెరీర్‌లో 25 టెస్టులు, 180 వన్డేలు, 270 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో ఈయన సాధించిన అత్యధిక స్కోరు 264. 30 సంవత్సరాల రోహిత్ శర్మ గతంలో ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్ తరఫున కూడా ఆడాడు.