ODI World Cup 2023: వన్డే వరల్డ్ కప్ గ్లోబల్ అంబాసిడర్‌గా సచిన్ టెండూల్కర్
Cricket World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023 గ్లోబల్ అంబాసిడర్‌గా సచిన్ టెండూల్కర్‌ను నియమించింది ఐసీసీ. దీంతో టెండూల్కర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ODI World Cup 2023 Ambassador: భారత్ వేదికగా మరో రెండు రోజుల్లో వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి గ్లోబల్ అంబాసిడర్ గా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. రేపు అంటే అక్టోబరు 04వ తేదీ బుధవారం అహ్మదాబాద్ లో జరగనున్న ఓపెనింగ్ ఈవెంట్లో సచిన్ ఈ ట్రోఫీని రివీల్ చేయనున్నారు. సచిన్ కు ఆరు ప్రపంచ కప్‌లు ఆడిన రికార్డు ఉంది. ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ మధ్య ప్రారంభ మ్యాచ్‌కు ముందు ప్రపంచ కప్ ట్రోఫీతో టోర్నమెంట్‌ను ప్రారంభించినట్లు ప్రకటించాడు.
"1987లో బాల్ బాయ్‌గా ఉన్నప్పటి నుండి ఆరు వరల్డ్ కప్ ఎడిషన్లలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే వరకు.. ప్రపంచ కప్‌లు ఎల్లప్పుడూ నా హృదయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి. 2011లో ప్రపంచ కప్ గెలవడం నా క్రికెట్ ప్రయాణంలో గర్వించదగిన క్షణం. ఈ మెగా టోర్నీలో పాల్గొనేందుకు ప్రపంచంలోని మేటి జట్లన్నీ భారత్ కు వచ్చాయి. ఈ అద్భుతమైన టోర్నమెంట్ కోసం ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాను. యువతీ యువకులకు ఈ టోర్నీ మంచి స్పూర్తినిస్తుందని'' అన్నారు సచిన్.
Also Read: IND vs NED: మళ్లీ అడ్డుపడిన వరుణుడు.. భారత్, నెదర్లాండ్స్ వార్మప్ మ్యాచ్ రద్దు..
సచిన్ ను గ్లోబల్ అంబాసిడర్ గా నియమించిన ఐసీసీ..టోర్నీని మరింత రసవత్తరంగా మార్చేందుకు మరికొంత మంది క్రికెటర్లను అంబాసిడర్ లుగా ప్రకటించింది. వారిలో వెస్టిండీస్ లెజెండ్ వివియన్ రిచర్డ్స్, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్, ఇంగ్లండ్ ప్రపంచ కప్ విన్నింగ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ఆస్ట్రేలియా హిట్టర్ ఆరోన్ ఫించ్, శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్, టీమిండియా మాజీ ప్లేయర్ సురేశ్ రైనా, న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్, పాకిస్థాన్ ఆల్ రౌండర్ మహ్మద్ హఫీజ్, భారత మహిళల మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఉన్నారు. ఈ ప్రపంచకప్ కు గ్లోబల్ అంబాసిడర్ గా సచిన్ ను నియమించడం గౌరవంగా భావిస్తున్నామని ఐసిసి మార్కెటింగ్ & కమ్యూనికేషన్స్ జనరల్ మేనేజర్ క్లైర్ ఫర్లాంగ్ అన్నారు.
Also Read: World Cup 2023: ప్రపంచకప్ 2023 ఆడనున్న ప్రపంచంలోని టాప్ 5 ధనవంతులు వీళ్లే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook