Sania Mirza-Shoaib Malik: సానియా మీర్జా-షోయబ్ మాలిక్ విడాకులు కన్ఫార్మ్.. ఈ పోస్ట్‌తో క్లారిటీ..!
Sania Mirza and Shoaib Malik Divorce News: షోయబ్ మాలిక్ తన ఇన్‌స్టాలో బయోను మార్చేశాడు. సానియా మీర్జా భర్త అని గతంలో పెట్టుకోగా.. తాజాగా తొలగించాడు. దీంతో మరోసారి విడాకుల రూమర్లు మొదలయ్యాయి.
Sania Mirza and Shoaib Malik Divorce News: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ల విడాకుల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ స్పోర్ట్స్ కపుల్స్ విడాకులు తీసుకుంటునున్నారని కొంత కాలం కిందట ప్రచారం జరగ్గా.. సైలెంట్ అయ్యాయి. చాలా కాలంగా వీరి సంసార జీవితం సాఫీగా సాగడం లేదని నెట్టింట చర్చ జరిగింది. ఇద్దరు కలిసి ఉండడం లేదని.. అందుకే విడాకులకు సిద్ధమయ్యారని రూమర్లు వచ్చాయి. ఇప్పటివరకు సానియా, అటు మాలిక్ ఇప్పటివరకు స్పందించని విషయం తెలిసిందే. అయితే తాజాగా షోయబ్ మాలిక్ ఇన్‌స్టాగ్రామ్ బయోలో మార్పుతో మరోసారి ప్రచారం మొదలైంది.
షోయబ్ మాలిక్ ఇన్‌స్టాగ్రామ్ బయోలో ఇంతకుముందు రాసిన చిన్న మార్పు చేయడంతో నెట్టింట స్క్రీన్‌షాట్లు వైరల్ అవుతున్నాయి. ఇంతకు ముందు ఇన్‌స్టా బయోలో "సూపర్ ఉమెన్ సానియా మీర్జా భర్త" అని ఉండేది. అయితే ఇప్పుడు ఆ బయోని మాలిక్ మార్చేశాడు. సానియా మీర్జా భర్త అని తన బయో నుంచి తొలగించాడు. దీంతో సానియా-మాలిక్ విడాకులు కన్ఫార్మ్ అయ్యాయని అభిమానులు చర్చించుకుంటున్నారు. అందుకే మాలిక్ తన బయోను అప్‌డేట్ చేశాడని పోస్టులు పెడుతున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఇంకా అధికారిక ధృవీకరణ లేదు. షోయబ్, సానియా నుంచి కూడా ఈ విషయమై ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
షోయబ్ మాలిక్ సానియా మీర్జాను మోసం చేశాడని గతంలో వార్తలు వచ్చాయి. పాకిస్థానీ నటి అయేషా ఉమర్‌తో మాలిక్ ఎఫైర్ ఉందని.. అందుకే సానియాను దూరం పెట్టాడని ప్రచారం జరిగింది. షోయబ్, అయేషా కలిసి దిగిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. కొన్నాళ్ల క్రితం మాలిక్‌కు అయేషాతో ఏర్పడిన పరిచయం.. ప్రేమగా మారిందని చర్చ జరిగింది. భర్త మాలిక్ మోసం చేయడంతోనే సానియా విడాకుల వరకు వెళ్లిందని అంటున్నారు. వీరిద్దరు కలిసి చేస్తున్న 'ది మీర్జా మాలిక్ షో' కారణంగానే విడాకులు ఆలస్యమైందని వార్తలు వచ్చాయి. విడాకుల విషయం అధికారికంగా తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే..!
Also Read: IND vs WI: భారత కుర్రాళ్లకు పరీక్ష.. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ నేటి నుంచే..
Also Read: Adah Sharma hospitalised: 'ది కేరళ స్టోరీ' నటి ఆదాశర్మకు అస్వస్థత..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook