India and West Indies: భారత కుర్రాళ్లకు పరీక్ష.. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ నేటి నుంచే..

IND vs WI: టెస్టుల్లో, వన్డేల్లో భారత జట్టుకు పెద్దగా పోటీ ఇవ్వని వెస్టిండీస్ జట్టు టీ20ల్లో చాలా ప్రమాదకారి. ఆ జట్టును తేలిగ్గా తీసుకుంటే ఓటమి తప్పదు. ఈ ఫార్మాట్లో ఆ జట్టు ఆటగాళ్లు సిద్ధహస్తులు. విండీస్‌తో నేటి నుంచి టీమిండియా టీ20 సిరీస్ ఆడబోతుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 3, 2023, 06:38 AM IST
India and West Indies: భారత కుర్రాళ్లకు పరీక్ష.. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ నేటి నుంచే..

India vs West Indies Squad 2023: విండీస్ పై టెస్టు సిరీస్, వన్డే సిరీస్ గెలిచి మాంచి ఊపు మీదున్న టీమిండియా ఇప్పుడు కరీబియన్ జట్టు టీ20 సమరానికి రెడీ అయింది.  ఈ ఫార్మాట్లో వెస్టిండీస్‌ ఆటగాళ్లను తక్కువ అంచనా వేస్తే భారత్ బోల్తా పడటం ఖాయం. టీ20 లీగ్‌ల్లో విండీస్‌ వీరుల మెరుపులే ఇందుకు ఉదాహరణ. కాబట్టి గురువారం జరిగే తొలి టీ20లో టీమిండియా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. తొలి టీ20కి  బ్రయాన్‌ లారా స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ పిచ్ బ్యాటింగ్ కు సహకరిస్తుంది. భారత్‌, విండీస్‌ల మధ్య మూడో వన్డే ఇక్కడే జరిగింది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. 

వెస్టిండీస్‌తో అయిదు టీ20ల సిరీస్‌లో భాగంగా.. ఇవాళ జరిగే తొలి టీ20లో భారత్ తుది జట్టు కూర్పు ఎలా ఉండబోతుందనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.  హైదరాబాద్‌ కుర్రాడు తిలక్‌ వర్మతో పాటు మరో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌ ఈ మ్యాచ్‌ ద్వారా టీ20 అరంగేట్రం చేసే అవకాశముంది. శుభ్‌మన్‌తో కలిసి యశస్వినే ఓపెనింగ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మూడో స్థానంలో ఇషాన్‌ కిషన్‌ వచ్చే అవకాశం ఉంది. తిలక్‌ నాలుగో స్థానంలో రావచ్చు. కెప్టెన్‌  హార్దిక్‌ పాండ్య, వైస్‌కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్ దిగే అవకాశం ఉంది. అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ స్పిన్‌ బాధ్యతలను చూసుకుంటారు. మూడో స్పిన్నర్‌గా చాహల్‌, రవి బిష్ణోయ్‌ల్లో ఒకరిని ఆడించే అవకాశం ఉంది. పేసర్ ముకేశ్ ఈ మ్యాచ్ ద్వారా టీ20ల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. 

Also Read: India Vs Pakistan: వన్డే ప్రపంచ కప్‌ షెడ్యూల్‌ మార్పు.. దాయాదీల పోరు ఎప్పుడంటే.. ?

భారత్ తుది జట్టు అంచనా: శుభ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌, ఇషాన్‌ కిషన్‌, తిలక్‌ వర్మ, హార్దిక్‌ (కెప్టెన్‌), సూర్యకుమార్‌, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌, చాహల్‌/రవి బిష్ణోయ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌/అవేష్‌ ఖాన్‌, ముకేశ్‌కుమార్‌.
వెస్టిండీస్‌ తుది జట్టు అంచనా: మేయర్స్‌, కింగ్‌, హోప్‌/చార్లెస్‌, పూరన్‌, హెట్‌మయర్‌, రోమన్‌ పావెల్‌ (కెప్టెన్‌), రోస్టన్‌ చేజ్‌, జేసన్‌ హోల్డర్‌, రొమారియో షెఫర్డ్‌/ఒడియన్‌ స్మిత్‌, అకీల్‌, అల్జారి జోసెఫ్‌.

Also read: Stuart Broad Rare feat: టెస్టు క్రికెట్ లో ఎవరికి సాధ్యం కాని ఫీట్ సాధించిన స్టువర్ట్‌ బ్రాడ్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News