Sania Mirza: కెరీర్ ప్రారంభించిన చోటే ముగించిన సానియా మీర్జా.. కన్నీళ్లతో వీడ్కోలు
Sania Mirza Retirement: భారత మహిళా టెన్నిస్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది సానియా మీర్జా. ప్రపంచస్థాయి వేదికలపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన ఈ స్టార్ ప్లేయర్.. తన కెరీర్‌కు భావోద్వేగంతో వీడ్కోలు పలికింది. హైదరాబాద్‌లో చివరి మ్యాచ్ ఆడేసింది.
Sania Mirza Retirement: భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తన కెరీర్‌ను విజయంతో ముగించింది. ఎక్కడ టెన్నిస్ కెరీర్‌ను ఆరంభించిందో.. అదే స్థలంలో చివరి మ్యాచ్ ఆడేసింది. హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ టెన్నిస్ స్టేడియంలో జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో సానియా తన కెరీర్‌కు గుడ్ బై చెప్పింది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం హైదరాబాద్‌లోనే చారిత్రాత్మక డబ్ల్యూటీ సింగిల్స్ టైటిల్‌తో ఆమె కెరీర్‌ను మొదలుపెట్టింది. మ్యాచ్ అనంతరం సానియా భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఆనందభాష్పలతో టెన్నిస్‌కు వీడ్కోలు పలికింది.
సానియా చివరి మ్యాచ్‌ను వీక్షించేందుకు చాలామంది క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ రోహన్ బోపన్న, యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, అనన్య బిర్లా, హుమా ఖురేషి, దుల్కర్ సల్మాన్, తెలంగాణ మంత్రులు కేటీఆర్, వి.శ్రీనివాస్ గౌడ్, సానియా మీర్జాకు ప్రాణ స్నేహితురాలు బెథానీ మాటెక్, ఇవాన్ డోడిగ్, కారా బ్లాక్, మరియన్ బార్టోలీ తదితరులు ఉన్నారు.
36 ఏళ్ల సానియా రెడ్ కలర్ కారులో స్టేడియానికి చేరుకుంది. పలువురు ప్రముఖులతో పాటు ప్రేక్షకులు చప్పట్లతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. తన వీడ్కోలు ప్రసంగంలో సానియా భావోద్వేగానికి గురైంది. 20 ఏళ్లుగా దేశం తరఫున ఆడడమే తనకు దక్కిన అతిపెద్ద గౌరవమని ఆమె పేర్కొంది. 'మీ అందరి ముందు నా చివరి మ్యాచ్ ఆడేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాను. నా చివరి మ్యాచ్‌ను హైదరాబాద్‌లోని నా ఇంటి ప్రేక్షకుల ముందు ఆడాలని నేను కోరుకున్నాను. నా కోరిక నెరవేర్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు..' అని సానియా మీర్జా తెలిపింది.
ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆమె పేర్కొంది. ఇంతకంటే మంచి వీడ్కోలు ఊహించలేదంటూ.. ప్రేక్షకుల ఉత్సాహాన్ని చూసి సానియా భావోద్వేగానికి గురైంది. ఈరోజు ఎమోషనల్ అవుతానని అనుకోలేదని.. కానీ ఇవి ఆనందభాష్పాలంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తన జీవితంలో చాలా విషయాలు ఈ స్టేడియం నుంచే మొదలయ్యాయని చెప్పుకొచ్చింది.
జనవరి నెలలోనే సానియా మీర్జా తన గ్రాండ్‌స్లామ్ ప్రయాణాన్ని ముగించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్ తరువాత రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన సానియా.. గ్రాండ్‌స్లామ్ గెలిచి కెరీర్‌ను టైటిల్‌తో ముగించాలన్న కల నెరవేరలేదు. ఆమె ఖాతాలో మొత్తం ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. మూడు డబుల్స్, మూడు మిక్స్‌డ్ డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను గెలుచుకుంది.
Also Read: Urinated In American Flight: విమానంలో మరో మూత్ర విసర్జన ఘటన.. మద్యం మత్తులో నిద్రపోతూ..
Also Read: Zoom Layoffs: జూమ్ సంచలన నిర్ణయం.. ఆకస్మికంగా అధ్యక్షుడికి ఉద్వాసన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook