Sanajay Manjrekar: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2021(ICC T20 World Cup)లో భాగంగా.. శుక్రవారం (నవంబర్‌5) టీమిండియా స్కాట్‌లాండ్‌(Scotland‌)తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో భారత్ మెరుగైన రన్ రేట్ తో గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే మ్యాచ్ కు ముందు టీమిండియా మాజీ క్రికెటర్‌ సంజయ్ మంజ్రేకర్(Sanjay Manjrekar) ఆసక్తికర వాఖ్యలు చేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమిండియా(Teamindia) టీ20 జట్టులో చాలా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అతడు అభిప్రాయపడ్డాడు. దీనికి ఉదాహరణగా మహ్మద్ షమీ(Mohammed Shami)ని అతడు పేర్కొన్నాడు. టెస్ట్ క్రికెట్ మరియు వన్డేల్లో షమీ గొప్ప బౌలర్ అన్న మంజ్రేకర్ ...పొట్టి ఫార్మాట్‌కు అతడు సరిపోడని వ్యాఖ్యానించాడు. 


Also read: New Zealand Tour Of India: ఇండియాతో సిరీస్ కు జట్టును ప్రకటించిన న్యూజిలాండ్


"భారత్‌  టీ20 జట్టులో మార్పులు చేయవలిసిన సమయం ఆసన్నమైందని నేను భావిస్తున్నాను. ప్రస్తుత జట్టులో  కొంతమంది ఆటగాళ్లు టీ20 ఫార్మాట్‌లో కాకుండా, ఇతర ఫార్మాట్‌లో ఆడేందుకు బాగా సరిపోతారు. వారి స్థానంలో కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి. నేను మహ్మద్ షమీ గురించి మాట్లాడుతున్నాను. నా దృష్టిలో షమీ  భారత క్రికెట్ కు గొప్ప ఆస్తి. మంచి నాణ్యమైన బౌలర్ కూడా. అయితే అది టెస్టు మ్యాచ్ ల వరకే పరిమితం. టీ20లలో అతడి ఎకానమీ 9 కి చేరింది. అతడు ఆఫ్ఘనిస్తాన్‌పై బాగా బౌలింగ్ చేశాడని నాకు తెలుసు. అయితే టీ20 క్రికెట్‌లో మహ్మద్ షమీ కంటే మెరుగైన బౌలర్లు భారత్‌లో ఉన్నారు అని అతడు పేర్కొన్నాడు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి