పాక్ మాజీ క్రికెటర్ అఫ్రిది కాశ్మీర్ విషయంలో చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. భారత్‌పై విషం చిమ్ముతూ.. కాశ్మీర్ అంశాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశాడు. భారత ఆక్రమిత కశ్మీర్‌లో ప్రజల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, వారిపై తీవ్రమైన అణచివేత కొనసాగుతోందని, దాన్ని వ్యతిరేకిస్తూ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తోన్న అమాయకులు భారత్‌ సైన్యం తుపాకీ తూటాలకు బలైపోతున్నారని...ఏదో  కల్లోలం జరుగుతుందంటూ  ట్వీట్ చేశాడు. కశ్మీర్‌లో అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్న భారత్‌పై ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు చర్యలు తీసుకోవాలని కూడా వ్యాఖ్యానించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ట్వీట్‌పై స్పందించిన టీమిండియా క్రికెటర్‌ గౌతం గంభీర్ దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. అఫ్రిది వ్యాఖ్యలను అంతగా పట్టించుకోనక్కరలేదని, అతను నోబాల్‌తో వికెట్‌ తీసి సంబరాలు చేసుకుంటున్నాడని ఈ ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ కెప్టెన్‌ వ్యాఖ్యానించాడు. పాపం.. యూఎన్ అంటే అఫ్రిదీ అండర్ నైంటీన్ అనుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. ‘మా కాశ్మీర్’ అన్న అఫ్రిదీ వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా కోరిందని, ఇందులో స్పందించడానికి ఏముందని ప్రశ్నించాడు. మీడియా దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యూఎన్ అంటే అండర్ నైన్టీన్ అనుకుని అఫ్రిదీ అదే ఏజ్ గ్రూప్‌లో ఉన్నట్టు భ్రమిస్తున్నాడని గంభీర్ ఎద్దేవా చేశాడు. అఫ్రిది నోబాల్‌తో వికెట్‌ తీసి సంబరపడున్నాడని వ్యంగ్యంగా ట్వీట్‌ చేశాడు.