వైరల్‌గా మారిన శిఖర్ ధావన్ ఎమోషనల్ వీడియో
వైరల్‌గా మారిన శిఖర్ ధావన్ ఎమోషనల్ వీడియో
బర్మింగ్‌హమ్: ప్రపంచ కప్ పోటీల్లో దేశం తరపున ఆడాలని ఎంతో తపించిన తాను ఆదిలోనే గాయం కారణంగా ఇంగ్లండ్ నుంచి ఇండియాకు వెనుతిరిగిరావాల్సి రావడం తీవ్ర విచారానికి గురిచేసిందని టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశాడు. బొటనే వేలికి గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి తప్పుకున్న శిఖర్ ధావన్.. తనకు అండగా నిలిచి ధైర్యం చెప్పిన అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ ఓ ఎమోషనల్ వీడియో పోస్ట్ చేశాడు. దురదృష్టవశాత్తుగా గాయం కారణంగా తాను తప్పుకోవాల్సి రావడం బాధగా ఉందన్న శిఖర్ ధావన్.. టీమిండియా దూకుడు కొనసాగించాలని కోరుకుంటున్నట్టు ఆ వీడియోలో పేర్కొన్నాడు. ధావన్ ఏమన్నాడో అతడి మాటల్లోనే...
ఇదిలావుంటే, శిఖర్ ధావన్ స్థానంలో భారత జట్టులోకి రిషబ్ పంత్‌ని తీసుకున్న సంగతి తెలిసిందే. పంత్ ఎంపికకు ఐసిసి సైతం ఆమోదం తెలిపింది. అంతకన్నా ముందుగా పాక్‌తో ఆడిన ఆటలో ధావన్ స్థానంలో కేఎల్ రాహుల్ ఆడగా ఆ తర్వాత ధావన్ స్థానాన్ని భర్తీ చేస్తూ బీసీసీఐ పంత్‌ని జట్టులోకి తీసుకుంది.