ప్రతిష్టాత్మక విజ్డెన్ టాప్‌ క్రికెటర్ల జాబితాలో భారత వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు చోటు దక్కకపోవడంపై మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఘాటుగా స్పందించాడు. అసలు రోహిత్‌ శర్మ లేకుండా జాబితా తయారు చేయడాన్ని సైతం ప్రశ్నించాడు. క్రికెట్‌ గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ విజ్డెన్‌ 2019 జాబితాలో హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ పేరు లేకపోతే ఆశ్చర్యపోవడం ఖాయమన్నారు. యాషెస్‌ సిరీస్‌ కంటే ప్రపంచ కప్‌కే అధిక ప్రాధాన్యం ఉంటుందని వ్యాఖ్యానించాడు.  Pics: ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీవీఎస్‌ లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు ప్రస్తావించాడు. ‘2019 వన్డే ప్రపంచ కప్‌లో రోహిత్‌ శర్మ రికార్డు స్థాయిలో 5 శతకాలు సాధించాడు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా జట్టుపై కఠిన పిచ్‌ మీద చేసిన తొలి శతకం అద్భుతం. పాకిస్థాన్‌ జట్టుపై చేసిన శతకాన్ని తీసిపారేయలేం. కానీ రోహిత్‌ శర్మ పేరు లేకుండా టాప్‌ 5 జాబితా రావడం చూసి ఆశ్చర్యపోయా. యాషెస్‌ విలువైన సిరీస్‌. కానీ దానికి మించిన టోర్నీ వరల్డ్‌ కప్‌ అని గుర్తుంచుకోవాలని’ హితవు పలికాడు.  ప్రాణాలు పోతుంటే IPL అవసరమా?: గంగూలీ


2019 ఏడాదికిగానూ విజ్డెన్‌ క్రికెటర్స్‌గా వరల్డ్‌ కప్‌ హీరో, ఇంగ్లాండ్‌ ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌, మహిళల నుంచి ఎలీస్‌ పెర్రీ పేరును ప్రకటించారు. 2005లో ఆండ్రూ ఫ్లింటాఫ్‌ తరువాత విజ్డెన్‌ క్రికెటర్‌గా నిలిచాడు బెన్‌ స్టోక్స్‌.


కాగా, విజ్డెన్‌ జాబితాలో పాట్‌ కమిన్స్‌, మర్నస్‌ లబుషేన్‌, జోఫ్రా ఆర్చర్‌, సిమోన్‌ హార్మర్‌లు చోటు దక్కించుకున్నారు. కాగా, రోహిత్‌ శర్మ పేరు లేకపోవడాన్ని భారత క్రికెట్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


 Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ


బుల్లితెర భామ టాప్ Bikini Photo