Wanindu Hasaranga: హసరంగా సంచలన బౌలింగ్.. తొలి స్పిన్నర్‌గా రికార్డు
Wanindu Hasaranga Five Wickets: వరల్డ్ కప్ 2023 క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను 192 పరుగుల తేడాతో శ్రీలంక చిత్తు చేసింది. ఈ విజయంతో శ్రీలంక సూపర్ సిక్స్‌కు అర్హత సాధించగా.. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన ఐర్లాండ్ ప్రపంచకప్ రేసు నుంచి తప్పుకుంది.
Wanindu Hasaranga Five Wickets: శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. వన్డేల్లో వరుసగా మూడుసార్లు ఐదు వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గానూ.. రెండో బౌలర్‌గానూ అరుదైన ఘనత సాధించాడు. దిగ్గజ పాకిస్థానీ బౌలర్ వకార్ యూనిస్ సరసన హసరంగా చేరాడు. వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 79 పరుగులు ఇచ్చి ఐదు వికెట్ల తీసిన హసరంగా.. అంతకుముందు రెండు మ్యాచ్‌ల్లో వరుసగా 6/24, 5/13 ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. వకార్ 5/11, 5/16, 5/52 గణాంకాలతో తన ఫీట్‌ను సాధించాడు. మరో మ్యాచ్‌లో హసరంగా 5 వికెట్లు తీస్తే.. తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.
ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 133 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.5 ఓవర్లలో 325 పరుగులకు ఆలౌట్ అయింది.
ఓపెనర్ కరుణరత్నే (103) సెంచరీతో కదం తొక్కగా.. సదీర సమరవిక్రమ (82), ధనంజయ డిసిల్వా (42) లంకేయులు భారీ స్కోరు చేశారు. అసలకం (38) రాణించాడు. చివరి వరుస బ్యాట్స్‌మెన్ కాస్త సహకారం అందించి ఉంటే.. శ్రీలంక స్కోరు 350 దాటేది. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అదైర్ 4, బ్యారీ మెక్‌కార్తీ 3, డేలానీ 2, జోషువా లిటిల్ ఒక వికెట్ పడగొట్టారు.
326 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక బౌలర్ల ధాటికి ఐర్లాండ్ వణికిపోయింది. ఒక దశలో 86 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో హ్యారీ టెక్టర్ (33), కర్టిస్ కాంఫెర్ (39) జట్టును కాస్త ఆదుకున్నారు. డాక్రెల్ (26) నాటౌట్‌గా నిలిచాడు. 31 ఓవర్లలో 192 రన్స్‌కు ఐర్లాండ్ ఆలౌట్ అయింది. హసరంగా 5, మహేశ్ తీక్షణ 2 తీసుకోగా.. మిగిలిన బౌలర్లకు చెరో వికెట్ దక్కింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సెంచరీ వీరుడు కరుణరత్నేకు దక్కింది.
ఈ విజయంలో శ్రీలంక క్వాలిఫయర్‌లో సూపర్ సిక్స్ దశకు చేరుకుంది. ఐర్లాండ్ ప్రపంచ కప్ రేసు నుండి నిష్క్రమించింది. మాజీ ఛాంపియన్ శ్రీలంక మూడు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో మొత్తం ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ఐర్లాండ్ నాలుగోస్థానంలో ఇంటిముఖం పట్టింది.
Also Read: Sarfaraz Khan: ఒక్క వీడియోతో బీసీసీఐకి ఇచ్చిపడేసిన సర్ఫరాజ్ ఖాన్
Also Read: YSR Law Nestham Scheme: గుడ్‌న్యూస్.. నేడే అకౌంట్‌లో రూ.25 వేలు జమ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి