Smriti Mandhana: భారత మహిళా బ్యాటర్ స్మృతి మంధాన ఖాతాల్లోకి సరికొత్త రికార్డు చేరింది. టీ20 ఫార్మాట్‌లో టీమిండియా తరపున ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గా నిలిచింది. భారత దిగ్గజాల సరసన చేరింది. ఇందులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. టీ20ల్లో అతడు టీమిండియా తరపున ఓపెనర్‌గా 96 ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగి 2 వేల 973 పరుగులు సాధించాడు. స్మృతి మంధాన కేవలం 79 ఇన్నింగ్స్‌లోనే 2 వేల పరుగుల మార్కును అందుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బర్మింగ్ హామ్‌ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో ఈ ఫీట్ సాధించింది. బార్బడోస్‌ మ్యాచ్‌లో 5 పరుగులు చేసి ఔట్ అయ్యింది. దీంతో టీ20ల్లో 2 వేల 4 పరుగులు చేసింది. ఈనేపథ్యంలో టీమిండియా వన్డే ఓపెనర్ శిఖర్‌ ధావన్, మహిళా జట్టు మాజీ సారధి మిథాలీ రాజ్, కీలక ఆటగాడు కేఎల్ రాహుల్‌ను వెనక్కి నెట్టింది. మొత్తంగా కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా జట్టు సెమీస్‌కు చేరింది. బార్బడోస్ మ్యాచ్‌లో గెలవడం ద్వారా నాకౌట్‌కు వెళ్లింది. 


సెమీస్‌లో గెలిస్తే పతకం ఖాయం కానుంది. ఆ దిశగా హర్మన్ ప్రీత్ కౌర్ సేన కసరత్తు జరుగుతోంది. 2013లో స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టింది. 2014లో టెస్ట్‌ల్లో ఎంట్రీ ఇచ్చింది. టీ20ల్లో రోహిత్ శర్మ 2 వేల 973 పరుగులు, స్మృతి మంధాన 2 వేల 4 పరుగులు, శిఖర్ ధావన్ 17 వందల 59 పరుగులు చేశారు. మిథాలీ రాజ్‌ 14 వందల 7, కేఎల్ రాహుల్ 13 వందల 92 పరుగులు సాధించారు.


Also read:India vs West Indies: అమెరికాలోనే యధావిధిగా టీ20 మ్యాచ్‌లు..విండీస్ క్రికెట్ బోర్డు ప్రకటన..!


Also read:Gorantla Madhav: న్యూడ్ వీడియో అంతా కుట్ర..న్యాయ పోరాటం చేస్తానన్న ఎంపీ గోరంట్ల మాధవ్..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook