Sourav Ganguly reacts on show-cause notice to Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli)కి తాను షోకాజ్ నోటీసులు (Show-Cause Notice) పంపాలనుకుంటున్నట్లు వస్తున్న కథనాలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) స్పందించారు. ఇలాంటివి అర్థ రహితమైనవి అని దాదా స్పష్టం చేశారు. షోకాజ్ నోటీసుల వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో తెలియట్లేదని గంగూలీ పేర్కొన్నారు. అసలు ఏం జరిగిందంటే...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత ఏడాది టీ20 ప్రపంచకప్ 2021 అనంతరం టీ20 కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన విరాట్ కోహ్లీ.. మెగా టోర్నీకి ముందే తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటించాడు. దాంతో రోహిత్ శర్మ జట్టు పగ్గాలు అందుకున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు డిసెంబరులో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తప్పించింది. వన్డే, టీ20లకి ఒకరే సారథిగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నామని సెలెక్టర్లు ప్రకటించారు. దాంతో బీసీసీఐపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. 


Also Read: Rishith Reddy Indian Team: హైదరాబాద్ ఆటగాడికి బంపర్‌ ఆఫ‌ర్‌.. ఏకంగా టీమిండియాలో చోటు!!


విరాట్ కోహ్లీ కెప్టెన్సీ (Virat Kohli Captaincy) విషయంపై బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కోహ్లీని టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగొద్దని తాను రిక్వెస్ట్ చేసినా.. అతడు వినలేదన్నారు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు జరిగిన విలేకర్ల సమావేశంలో కెప్టెన్సీ గురించి కోహ్లీ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. టీ20 సారథ్య బాధ్యతలను వదులుకోవద్దని ఎవరూ చెప్పలేదని, వన్డే కెప్టెన్‌గా తొలగిస్తున్నట్లు కేవలం గంటన్నర ముందే తనకు సమాచారం ఇచ్చారని పేర్కొన్నాడు.


సౌరవ్ గంగూలీ చేసిన ప్రకటనకు విరాట్ కోహ్లీ (Ganguly vs Kohli) పూర్తిగా విరుద్ధంగా మీడియా సమావేశంలో మాట్లాడడంతో పెద్ద రాద్ధాంతం అయింది. దీంతో గంగూలీ ఒకానొక దశలో కోహ్లీకి షోకాజ్‌ నోటీసులు పంపేందుకు సిద్ధమయ్యాడట. అయితే బీసీసీఐ కార్యదర్శి జై షా ఈ విషయం పెద్దది కాకుండా ఆపాడని మీడియా వర్గాల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో తాజాగా గంగూలీ స్పందిస్తూ.. అలంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఇలాంటివి అర్థ రహితమైనవిగా పేర్కొన్నారు. దాంతో ఆ వార్తలకు ముగింపు పలికినట్లైంది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ ఓటమి అనంతరం కోహ్లీ టెస్ట్ ఫార్మాట్‌ కెప్టెన్సీకీ కూడా గుడ్‌ బై చెప్పిన విషయం తెలిసిందే.


Also Read: IPL 2022 Auction:​ కెప్టెన్​గా హార్దిక్.. అహ్మదాబాద్ ఎంచుకున్న ప్లేయర్స్ వీరే! లక్నో సారథి, కోచింగ్ లిస్ట్ ఇదే!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook