Quinton de Kock retires from Test cricket : సౌతాఫ్రికా (South Africa) వికెట్ కీపర్, బ్యాటర్ క్వింటన్ డికాక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఉన్నపళంగా టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఈ మేరకు క్రికెట్ సౌతాఫ్రికా ఒక ప్రకటన విడుల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ఇది అంత సులువుగా తీసుకున్న నిర్ణయం కాదు. నా భార్య సాషా, నేను మా మొదటి బిడ్డను స్వాగతించబోతున్న వేళ... ఇకపై నా భవిష్యత్ ఎలా ఉండాలి... దేనికి ప్రాధాన్యతనివ్వాలనే అంశాలపై ఎంతో ఆలోచించాను. నాకు నా కుటుంబమే సర్వస్వం. మా జీవితాల్లో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలకబోతున్న వేళ కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నాను.' అని క్వింటన్ డికాక్ వెల్లడించాడు.


భారత్‌తో (IND Vs SA) సెంచూరియన్ టెస్టు ఓటమి తర్వాత క్వింటన్ డికాక్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తాజా టెస్టులో డికాక్ పేలవ ప్రదర్శన కనబర్చాడు. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 34 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 21 పరుగులు మాత్రమే చేశాడు. 2014లో సౌతాఫ్రికా తరుపున టెస్ట్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన డికాక్.. ఇప్పటివరకూ 54 టెస్టులు ఆడి 3300 పరుగులు చేశాడు. టెస్టుల్లో డికాక్ కెరీర్ బెస్ట్ స్కోర్‌ను వెస్టిండీస్‌పై నమోదు చేశాడు. ఈ ఏడాది జూన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 144 పరుగులు చేశాడు.



క్వింటన్ డికాక్ టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ పట్ల సౌతాఫ్రికా క్రికెట్ (South Africa) బోర్డు విచారం వ్యక్తం చేసింది. డికాక్ లాంటి సత్తా కలిగిన ప్లేయర్‌ను వదులుకోవాల్సి వస్తున్నందుకు చింతిస్తున్నట్లు తెలిపింది. డికాక్ గత ఏడేళ్లుగా సౌతాఫ్రికా క్రికెట్ టీమ్‌కి ఎప్పుడూ విధేయుడిగా ఉన్నాడని... టీమ్ గర్వపడే పెర్ఫామెన్స్ కనబర్చాడని కొనియాడింది. 


 


Also Read: Heavy rain in Chennai: చెన్నైలో వర్ష బీభత్సం.. ముగ్గురు మృతి.. 4 జిల్లాలకు రెడ్ అలర్ట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook